పరువు హత్య కలకలం: కులపిచ్చి ముందు కన్నప్రేమ ఓడిపోయింది!
కర్ణాటకలో కుల దురహంకారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గర్భిణి అని కూడా చూడకుండా కన్నకూతురినే తండ్రి దారుణంగా కొట్టి చంపిన హృదయవిదారక ఘటన హుబ్బళ్లిలో చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆరు నెలల గర్భిణి అయిన సొంత కూతురిని తండ్రి, బంధువులు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది.
కులాంతర వివాహమే శాపమైందా?
మృతురాలు మాన్య పాటిల్(19) అదే గ్రామానికి చెందిన వేరే కులం యువకుడిని ఈ ఏడాది మే నెలలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం మాన్య తండ్రి ప్రకాష్‌కు అస్సలు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని భయపడిన మాన్య.. భర్తతో కలిసి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవేరి జిల్లాలో నివసించేది. చాలా కాలం దూరంగా ఉన్న మాన్య దంపతులు.. ఇటీవల డిసెంబర్ 8న తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. వీరి రాకను గమనించిన మాన్య తండ్రి ప్రకాష్, ఇతర బంధువులు ఆమెపై కక్ష పెంచుకున్నారు.

ఆదివారం మధ్యాహ్నం మాన్య భర్త, మామ పొలంలో ఉండగా.. నిందితులు వారిపై దాడికి ప్రయత్నించారు. అయితే వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో నిందితులు ఇనుప పైపులతో మాన్య అత్తగారి ఇంట్లోకి చొరబడ్డారు. ఆరు నెలల గర్భిణి అయిన మాన్యను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కొట్టారు. ఆమెను కాపాడబోయిన మాన్య అత్త రేణుకను, మామ సుభాష్‌లను కూడా నిందితులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిగా తరలించగా.. మాన్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అత్తమామలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల చర్యలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మాన్య తండ్రి ప్రకాష్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కులం కోసం కన్నప్రేమను మర్చిపోయి, పుట్టబోయే బిడ్డతో సహా కూతురిని చంపేసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications