అమెరికా పర్యటనలో మోడీని కలుస్తా: సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోడీని కలవాలని అనుకుంటున్నట్టు గూగుల్ ఆల్పాబేట్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్‌ను నిమిస్తూ ప్రకటించిన నేపథ్యంలో పిచాయ్‌కి ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌లో నిన్న (మంగళవారం) అభినందనలు తెలిపారు.
Congratulations @sundarpichai. My best wishes for the new role at @google.
— Narendra Modi (@narendramodi) August 11, 2015 ఈ ట్వీట్‌కు ప్రతి స్పందించిన సుందర్ ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పారు. సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిలికాన్ వ్యాలీలో వివిధ సంస్థలకు చెందిన సీఈఓలను కూడా కలవనున్నారు.
@narendramodi @google Thanks for the warm wishes and hope to have the opportunity to meet you soon
— sundarpichai (@sundarpichai) August 11, 2015 అప్పుడే తాను ప్రధాని మోడీని కలవాలనుకుంటున్నట్టు తాజాగా పిచయ్ వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మోడీ పాల్గొననున్నారు. 23 నుంచి 25 వరకు ఆయన న్యూయార్క్‌లో బస చేయనున్నారు.

ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. అక్కడి సిలికాన్ వ్యాలీలో నిర్వహించనున్న కార్యక్రమంలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు. గూగుల్ ప్రదాన కార్యా లయాన్ని కూడా మోడీ సందర్శించనున్నారు.
చివరిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. గతేడాది సెప్టెంబర్ లో తొలిసారి అమెరికాలో పర్య టించిన మోడీ, రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications