ప్రేమిస్తావా..? లేదా..? పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇంటర్ విద్యార్థిని గొంతు కోసి..
ప్రస్తుత కాలంలో ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడిచేంతగా పరిస్థితులు మారిపోయాయి. ప్రియుడుతో కలిసి భర్తలను కడతేరుస్తున్న భార్యలు ఓ వైపు ప్రేమిస్తావా..? లేదా..? అంటూ ప్రియుడు చేతిలో హత్యకు గురవుతున్న యువతులు మరోవైపు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇలాంటి ఘటనలే జరగుతున్నాయి. తాజాగా అలాంటి దారుణమైన ఘటనే మరొకటి జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ప్రియురాలి గొంతు కోసి పరారయ్యాడు.
పట్టపగలు అదీ ఓ ఆస్పత్రిలో అందరూ చూస్తుండగానే ఓ యువకుడు వచ్చి ఆస్పత్రిలో ఉన్న ఇంటర్ విద్యార్థిని గొంతు కోసి పరార్ అయ్యాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పుర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నర్సింగ్ పుర్ జిల్లాలోని పటేల్ వార్డుకు చెందిన సంధ్య చౌదరీ.. అదే గ్రామంలోని హీరాలాల్ చౌదరీ కూతురు. అయితే సంధ్య.. తన బంధువును పరామర్శించేందుకు నర్సింగ్ పుర్ లోని ట్రామా కేర్ ఆస్పత్రికి వచ్చింది.
అయితే సంధ్య ఆస్పత్రికి వచ్చిన విషయం తెలుసుకున్న ప్రియుడు అభిషేక్ కోస్తీ.. ఆమె వద్దకు వచ్చి కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో అందరూ చూస్తుండగానే ఆ యువతి గొంతుకోశాడు. తర్వాత తానూ బలవన్మరణానికి పాల్పడినట్లు నటించి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అయితే సంధ్యపై అభిషేక్ అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు చూస్తూ ఉండిపోయారు. కానీ ఎవరూ ముందుకొచ్చి అడ్డుకునే ధైర్యం చేయలేకపోయారు.

ఈ ఘటనపై నర్సింగ్ పుర్ ఎస్పీ మ్రిగాకీ దేఖా స్పందించారు. నిందితుడు అభిషేక్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. వాళ్లిద్ధరికీ గత రెండేళ్లుగా పరిచయం ఉందని విచారణలో తెలిసిందన్నారు. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందన్నారు. అయితే కొద్ది రోజులుగా సంధ్య తనను పట్టించుకోకుండా వేరొకరితో తిరుగుతోందని అనుమానం పెట్టుకున్న అభిషేక్.. ఆ విషయాన్ని అడిగేందుకు ఆస్పత్రికి వచ్చాడు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య వివాదం చెలరేగింది. అప్పుడే అభిషేక్.. సంధ్య గొంతు కోసి అక్కడినుంచి పరార్ అయ్యాడు.. అని నర్సింగ్ పుర్ ఎస్పీ మ్రిగాకీ దేఖా పేర్కొన్నారు.
ఈ ఘటనలో ఆ యువతి మృతి చెందిందని.. నిందితుడిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications