ఘోర ప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 11 మంది మృతి !
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్.. ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉండడం తీవ్రవిషాదం నింపుతోంది. ఈ ప్రమాదం దౌసా ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది.
ఆలయానికి వెళ్లి వస్తుండగా..
కాగా ఈ ప్రమాద బాధితులు ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా ఖాతు శ్యామ్, సాలాసర్ బాలాజీ ఆలయాలను సందర్శించి తిరిగి వస్తుండగా మనోహర్‌పూర్ హైవేపై తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని దౌసా పోలీసులు తెలిపారు.

ఇక స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అలానే దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ... ప్రాథమిక నివేదికల ప్రకారం ప్రమాదంలో తొలుత 10 మంది మరణించారని.. ఆ తర్వాత మరొకరు మరణించారని స్పష్టం చేశారు. తొమ్మిది మందిని చికిత్స కోసం ఆస్పత్రికి పంపించినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఎక్స్ వేదికగా దౌసాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందనే వార్త చాలా బాధాకరం. గాయపడిన వారికి సత్వర.. సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath expresses grief over the road accident in Dausa, Rajasthan. He expresses condolences to the families of the deceased and wishes for the speedy recovery of the injured. Instructions have been given to the officials to coordinate with… https://t.co/NHvfesrpv8
— ANI (@ANI) August 13, 2025












Click it and Unblock the Notifications