లంచం లేదని నెట్టేశారు, ఆంబులెన్స్ లో డెలివరి

ముజఫర్ నగర్: రోగులకు సేవ చెయ్యవలసిన నర్సులు మానవత్వం మరిచిపోయారు. సాటి మహిళ అని చూడకుండా పురిటి నోప్పులతో ఉన్న ఆమెను వేధించారు. లంచం ఇవ్వకుంటే ఆసుపత్రిలోకి అనుమతించమంటూ భీష్మించారు.

చివరికి ఆ మహిళ రోడ్డు మీద ఉన్న ఆంబులెన్స్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది. మానవత్వం మంటకలిసేటట్లు ప్రవర్తించిన ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ముజుఫర్ నగర్ లో జరిగింది. ముజఫర్ నగర సమీపంలో అమీర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

అమీర్ భార్య నిండు గర్బిణి. మంగళవారం భార్యకు ప్రసూతి నొప్పులు ఎక్కువ రావడంతో సలీం ఆమెను ఆంబులెన్స్ లో పిలుచుకుని ముజఫర్ నగర్ లోని కమ్యూనిటి హెల్త్ సెంటర్ (సీ హెచ్ సీ) దగ్గరకు తీసుకు వెళ్లాడు. అయితే ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సులు లంచం ఇస్తేనే లోపలికి పంపిస్తామని డిమాండ్ చేశారు.

 hospital allegedly demanded bribe, women delivers in ambulance

అమీర్ ఎంత బ్రతిమిలాడినా నర్సులు పట్టించుకోలేదు. అదే సమయంలో అమీర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు మీద ఉన్న ఆంబులెన్స్ లోనే ప్రసవించింది. తరువాత అమీర్ తన భార్యను వేరే ఆసుపత్రికి తీసుకు వెళ్లి చేర్పించాడు.

విషయం తెలుసుకున్న అమీర్ బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి దగ్గరకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ప్రసవించే సమయంలో తల్లి, బిడ్డకు జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యలంటూ నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆసుపత్రి సూపరెండెంట్ శరణ్ వీర్ సింగ్ విచారణకు ఆదేశించారు. లంచం డిమాండ్ చేసి అమానుషంగా ప్రవర్థించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అమీర్ కుటుంబ సభ్యులకు హామి ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+