చికిత్సకు వెళితే ఆసుపత్రిలో లైంగిక వేధింపులు
బెంగళూరు: చికిత్స చేయించుకోవడానికి వెళ్లిన మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన అటెండర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మైసూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్ గా పని చేస్తున్న కెంపరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు.
మైసూరు నగరంలోని ఎన్.ఆర్. మొహల్లా ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఎన్.ఆర్. మొహల్లా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక మహిళ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకొవడం కోసం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు చికిత్స అందించారు.

మరిన్ని పరీక్షలు చేయించుకోవాలని మహిళకు సూచించారు. ఆమె చికిత్సలో భాగంగా ఒక గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో అటెండర్ కెంపరాజు మహిళపట్ల అసభ్యంగా ప్రవర్థించాడు. రోగి అని చూడకుండా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ సమయంలో ఆమె అక్కడే కేకలు వేశారు.
అటెండర్ కెంపరాజు మీద మండిపడ్డారు. తరువాత కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వారిని వెంట పెట్టుకుని ఎన్.ఆర్. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కెంపరాజును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications