ఆసుపత్రిలో యువతి పై గ్యాంగ్ రేప్ చేసిన ఉద్యోగులు
కోల్ కతా: బంధువు ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన దారుణ సంఘటన కోల్ కతా నగరంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు దారుణమైన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ లోని ముషిరాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి (24) బంధువు కోల్ కతా లోని ఆర్ జీ కార్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. బంధువును పరామర్శించడానికి యువతి శుక్రవారం కోల్ కతా వెళ్లింది. తరువాత ఆసుపత్రిలో ఉన్న బంధవును పరామర్శించడానికి వెళ్లింది.

ఆ సందర్బంలో రాత్రి ఆసుపత్రిలో లిఫ్ట్ మెన్ గా పని చేసే మసూమ్ ఆలీ ఖాన్, మరో ఉద్యోగి హైదర్ ఆలీ యువతి మీద సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే నిన్ను అంతం చేస్తామని యువతిని ఇద్దరు హెచ్చరించారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మసూమ్ ఆలీ ఖాన్, హైదర్ ఆలీలను అరెస్టు చేశారు. యువతికి వైద్య పరిక్షలు నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నామని కోల్ కతా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications