సరిహద్దులో పాక్ కాల్పులు .. ముగ్గురు పౌరుల మృతి
ఫూంచ్/ కశ్మీర్ : దాయాది పాకిస్థాన్ వైఖరి మారదు. పాక్ లో చిక్కిన పైలట్ అభినందన్ ను అప్పగించిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో తూటాలు పేల్చింది. దీంతో ముగ్గురు పౌరులు మృతిచెందారు.

కాల్పుల మోత
అభినందన్ ను అప్పగించిన కొద్దీ గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల మోత మోగించింది. నియంత్రణ రేఖ దాటి చొచ్చుకొచ్చిన ముష్కరులు .. జమ్ముకశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలో తుపాకీలు, మోర్టార్ షెల్స్ తో దాడికి తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతిచెందారు. వీరిని రుబానా కోసర్, ఆమె కుమారుడు సోన ఫజాన్, 9 నెలల నెలల పాప షాబ్నాంగా గుర్తించారు. ఈ కాల్పుల్లో మరొకరు గాయపడినట్టు భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. భారీ తుపాకులు, మోర్టార్ షెల్స్ తో దాడికి తెగబడ్డారని .. వారిని ధీటుగా ఎదుర్కొన్నామని తెలిపారు.

ఎల్వీసీ 5 కి.మీ పరిధిలో బడులు బంద్
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నియంత్రణ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలు మూసివేయాలని జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫూంచ్, రాజౌరిలోని స్కూళ్లను తాత్కలికంగా క్లోజ్ చేయాలని స్పష్టంచేశారు. అలాగే గ్రామస్థులు ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచించారు.

ఇదేనా శాంతి ?
బుధవారం పాకిస్థాన్ భూభాగంలో ఆ దేశ ఆర్మీకి చిక్కిన ఫైలట్ అభినందన్ ను అప్పగిస్తామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. సాక్షాత్తు పార్లమెంట్ లో తాము శాంతి కోరుకుంటున్నామని సూక్తులు చెప్పారు. శుక్రవారం రాత్రి 9.19 గంటలకు అభిని అప్పగించిన .. కొన్ని గంటల్లోనే కాల్పుల మోత మోగి .. ముగ్గురు చనిపోయారు. దీంతో శాంతి అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

యధేచ్చగా కాల్పుల విరమణ
భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి పొరుగుదేశం తూట్లు పొడుస్తూనే ఉంది. సరిహద్దుల్లో యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. గత వారం నుంచి వరుసగా సరిహద్దులో కాల్పులు జరుపడం పాకిస్థాన్ చెబుతోన్న శాంతికి అర్థమా అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతోన్నాయి.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications