Bihar Caste Survey : బీహార్ కులాల సర్వే ఫలితాలతో పెనుమార్పులు ? ఎవరెవరికి చెక్ ?

కుల రాజకీయాలతో అలరారే బీహార్లో సామాజిక ఆధిపత్యం, అణచివేత తరతరాలుగా చూస్తున్నవే. గతంలో గాంధీ, రాజేంద్రప్రసాద్ ల స్వాతంత్ర పోరాటాలు, జగ్జీవన్ రామ్ సామాజిక ఉద్యమాలు, ఆ తర్వాత మండల్ కమిషన్ తీర్పుతో లాలూ, నితీష్ ల బీసీ రాజకీయాల్ని చూసిన బీహార్ లో ఇప్పటికీ సామాజిక న్యాయంపై చర్చ జరుగతూనే ఉంటుంది. అయితే బీహార్లో బీసీలే అండగా రాజకీయాలు చేస్తున్న లాలూ-నితీష్ ద్వయం తాజాగా నిర్వహించిన కులాల సర్వే ద్వారా రాజకీయాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది.

బీహార్లో తాజాగా నిర్వహించి కులాల సర్వే ఫలితాల్లో ఓబీసీ జనాభా ఏకంగా 63 శాతం ఉన్నట్లు తేల్చింది. ఇందులో లాలూ సామాజిక వర్గం యాదవులు అత్యధికంగా 14.2 శాతం ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత అగ్రవర్ణాలు 10.5 శాతంగా తేలారు. ఇందులో బ్రాహ్మణులు, రాజపుత్రులు, భూమిహార్లు, కాయస్ధులు వంటి కులాలున్నాయి. కానీ ఈ శాతాలకూ, రాష్ట్రంలో వారి రాజకీయ ప్రాతినిధ్యానికి అస్సలు పొంతన లేదు.

how bihar caste data will recalibrate state politics, and social fabric?

రాష్ట్రంలో అగ్రవర్ణాలైన భూమిహార్లకు చెందిన రణ్ వీర్ సేన గతంలో దళితులపై ఎన్నో దురాగతాలు చేసింది. రాష్ట్ర జనాభాలో భూమిహార్లు కేవలం 2.8 శాతం ఉండగా.. దళితులు ఏకంగా 19.6 శాతం ఉన్నారు. దీంతో రాష్ట్రంలో జనాభా పరంగా చాలా తక్కువగా ఉన్నప్పటికీ భూమిహార్ల చేతిలోనే అధికారం, పరపతి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అధికార వర్గాల్లో బ్రాహ్మణులు, కాయస్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ రాష్ట్రంలో వీరి జనాభా చాలా తక్కువ. తమిళనాడులో దశాబ్దాల క్రితం వచ్చిన ద్రవిడ ఉద్యమం తరహాలోనే ఇప్పుడు బీసీల జనాభా అలాంటి మరో ఉద్యమానికి సిద్ధమవుతోంది.

ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో తక్కువ జనాభాగా ఉన్న అగ్రవర్ణాలు ఇన్నాళ్లూ తమ అధికారం, పలుకుబడితో వెనుకబడిన వర్గాలు, దళితుల్ని ఎలా అణగదొక్కాయన్న అంశం ఇప్పుడు కులాల సర్వేతో బయటపడినట్లయింది. దీంతో ఇకపై వెనుక బడిన వర్గాలకు టికెట్లు, అధికార పదవుల్లో వాటా ఇవ్వాల్సిన పరిస్దితి వచ్చేసింది. ఇది సహజంగానే అగ్రవర్ణాల అండ కలిగిన బీజేపీకి ఇబ్బందికరంగా మారబోతోంది. అలాగే బీసీల అండతో ప్రభుత్వం నడిపిస్తున్న లాలూ-నితీశ్ ద్వయానికి భవిష్యత్తులో రాజకీయంగా భారీ ప్రయోజనం చేకూర్చబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+