వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కండల వీరుడిని మట్టి కరిపించిన 'బిష్ణోయ్': ఎవరు వీళ్లు?, ఎందుకింతలా పోరాడారు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

కండల వీరుడిని మట్టి కరిపించిన 'బిష్ణోయ్': ఎందుకింతలా పోరాడారు..!

న్యూఢిల్లీ: 20ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చింది జోధ్ పూర్ కోర్టు.ఈ కేసులో సల్మాన్ కి మూడేళ్ల కంటే తక్కువ శిక్ష పడి ఉంటే.. ఈపాటికే బెయిల్ మీద బయటకొచ్చేవాడు. కానీ న్యాయస్థానం ఐదేళ్ల శిక్ష విధించడంతో.. ఆ తీర్పును హైకోర్టులోనే సవాల్ చేయాల్సి ఉంటుంది.

సల్మాన్‌ఖాన్: ఖైదీ నెంబర్ 106, ఆశారాం బాపు సెల్ పక్కనే గది సల్మాన్‌ఖాన్: ఖైదీ నెంబర్ 106, ఆశారాం బాపు సెల్ పక్కనే గది

సాధారణంగా ఉన్నత స్థాయి వ్యక్తులు, సెలబ్రిటీలు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు... సులువుగా తప్పించుకోగలరు అన్న అభిప్రాయం జనాల్లో బలంగా పాతుకుపోయింది. అందుకు భిన్నంగా సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ లాంటి ఘటనలు ఆ అంచనాలు తప్పని నిరూపిస్తున్నాయి. సల్మాన్ విషయంలో మాత్రం 'బిష్ణోయ్' అనే తెగ చేసిన అలుపెరిగన పోరాటమే అతనికి శిక్ష పడేలా చేసిందంటున్నారు.

'బిష్ణోయ్' అంటే ఎవరు?:

'బిష్ణోయ్' అంటే ఎవరు?:

బిష్ణోయ్ తెగకు మూల పురుషుడు గురు జాంభేశ్వర్. 15వ శతాబ్దంలో 29నియమ నిబంధనలతో ఆయన ఈ తెగకు జీవం పోశారు. ప్రకృతిని పరిరక్షించడం, జంతువులను కాపాడటం దేవుడితో సమానమని వారికి బోధించాడు. అందువల్లే జంతువులను చంపడం, చెట్లను నరకడాన్ని బిష్ణోయ్ ప్రజలు మహా పాపంగా భావిస్తారు.

కృష్ణ జింకల కేసులో నేడే తుది తీర్పు: సల్మాన్ భవితవ్యంపై ఉత్కంఠ?.. కృష్ణ జింకల కేసులో నేడే తుది తీర్పు: సల్మాన్ భవితవ్యంపై ఉత్కంఠ?..

 ప్రాణ త్యాగానికైనా వెనుకాడరు..:

ప్రాణ త్యాగానికైనా వెనుకాడరు..:

చెట్లను, జంతువులను రక్షించుకోవడానికి ప్రాణత్యాగానికైనా వారు సిద్దపడుతారంటే వారి నిబద్దత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నమ్మిన ధర్మాన్ని ఆచరణలో పెట్టడానికి 1730లో రాజును సైతం ఎదిరించారు.

తన ప్యాలెస్ నిర్మాణం కోసం కేజ్రీ అనే చెట్లను నరకాల్సిందిగా అప్పటి జోధ్ పూర్ రాజు ఆదేశాలిచ్చాడు. ఆ సమయంలో బిష్ణోయ్ తెగ ప్రజలు రాజు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

 రాజునే ఎదిరించినవారు..:

రాజునే ఎదిరించినవారు..:

రాజు నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాదు.. సైనికులు చెట్లను నరుకుతుంటే.. అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో వారు చెట్లను వాటేసుకోగా.. సైనికుల గొడ్డలి వేటుకు బలైపోయారు. ఆ ఘటనలో వందలాది మంది బిష్ణోయ్ మహిళలు, పిల్లలు, పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి కాలంలో చిప్కో ఉద్యమ సృష్టికర్త అయిన అమృతా దేవికి ఈ ఘటనే స్ఫూర్తినిచ్చింది.

సల్మాన్ ఇలా దొరికిపోయాడు..:

సల్మాన్ ఇలా దొరికిపోయాడు..:

ప్రకృతి కోసం ప్రాణాన్నే లెక్క చేయనివారు.. ఇక సెలబ్రిటీలను మాత్రం ఉపేక్షిస్తారా. అందుకే సల్మాన్ ఖాన్ విషయంలోనూ మొండి పట్టుదలతో వారు పోరాడారు. కృష్ణ జింకలను సల్మాన్ వేటాడుతున్న సమయంలో పూనమ్ చంద్ బిష్ణోయ్ అనే దాన్ని ప్రత్యక్షంగా చూశాడు.

రాత్రి మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన సమయంలో.. సల్మాన్ సహా జీపులో వచ్చిన గ్యాంగ్ రెండు కృష్ణ జింకలను చంపిందని అతను తెలిపాడు. బిష్ణోయ్ వారిని అడ్డుకునేలోపే.. అప్రమత్తమై అక్కడినుంచి పారిపోయారు. కానీ ఆ జీపు నంబర్ ను అతను గుర్తుంచుకోవడంతో సల్మాన్&గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయింది.

English summary
Film star Salman Khan, found guilty today of killing black bucks in a Jodhpur village 20 years ago, would have never imagined that one of the most commonly found animals in the region, a black buck, would have the power to do him in. Since the Bishnois revere black bucks, ranged against Khan were people who won't hesitate in even laying down their own lives to save black bucks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X