
ములాయం కు ప్రధాని ఛాన్స్ మిస్ - చంద్రబాబు పాత్ర నాడు కీలకంగా..!!
ములాయం సింగ్ యాదవ్. భారత రాజకీయాల్లో అసలు సిసలైన పొలిటీషియన్. ఎప్పుడు ఎవరితో జత కట్డాలో - ఎప్పుడు ఎవరికి దూరం కావాలో జాతీయ రాజకీయాల్లో ములాయం తీసుకున్నంత వేగంగా మరో నేత తీసుకోలేదు. అతి చిన్న వయసులోనే చట్ట సభల్లోకి అడుగు పెట్టిన ములాయం..ఒక సమయంలో దేశ ప్రధాని కావాలని ఆశించారు. కానీ ఆయన ఆశ నెరవేరకపోవటం వెనుక అనేక రాజకీయ కారణాలు. కీలక నేతలు ఉన్నారు. ఫ్రంట్ లు కట్టటం.. నేతలను సమన్వయ పర్చటంలో ఉత్తరాది రాకీయాల్లో ములాయం కీలకంగా వ్యవహరించే వారు. నాడు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ములాయంతో కలిసి జాతీయ రాజకీయాల్లో కొనసాగారు.

ఫ్రంట్ రాజకీయాల్లో కీలకంగా ములాయం
ములాయం
ప్రధాని
కాకపోవటం-
నాడు
జరిగిన
రాజకీయంలో
చంద్రబాబు
పాత్ర
కీలకంగా
ప్రచారం
లో
నిలిచింది.
ములాయం
రాజకీయం
తొలి
నుంచి
ఎవరికీ
అందని
వ్యూహాలతోనే
సాగింది.
ఉత్తరప్రదేశ్
చౌధరీ
చరణ్
సింగ్
తరువాత
ఆయన
కుమారుడుకు
దక్కాల్సిన
సీఎం
పీఠం
ములాయం
దక్కించుకున్నారు.
అలా
1989లో
తొలి
సారి
దేశంలోనే
అతి
పెద్ద
రాష్ట్రానికి
ముఖ్యమంత్రి
అయ్యారు.
1993లో
తిరిగి
యూపీలో
తన
అధికారం
నిలబెట్టుకొని
రెండో
సారి
సీఎంగా
కొనసాగారు.
1996
నాటికి
కేంద్రంలో
రాజకీయ
పరిస్థితులు
మారిపోయాయి.
దీంతో..ములాయం
చూపు
ఢిల్లీ
మీద
పడింది.
అప్పటికే
ఎన్టీఆర్-
దేవీలాల్
-
రామక్రిష్ణ
హెగ్డే
వంటి
వారితో
నేషనల్
ఫ్రంట్
ప్రయోగాలు
జరిగాయి.
నాడు
బలమైన
పార్టీగా
ఉన్న
జనతదల్
చీలికలతో
ముఖ్యనేతలు
విడిపోయారు.
నాటి
ఫ్రంట్
నేతలు
ఎవరు
అధికారంలో
కొనసాగాలనున్నా..
కాంగ్రెస్
మద్దతు
కీలకం.
1996-99
కాలంలో
ఐకే
గుజ్రాల్
-
హెచ్
డీ
దేవగౌడ
ప్రభుత్వాల్లో
ములాయం
కీలకమైన
రక్షణ
శాఖ
మంత్రిగా
వ్యవహరించారు.

1996-98 కాలంలో ప్రధానిగా ప్రతిపాదన
1996లో
జరిగిన
ఎన్నికల్లో
యూపీ
నుంచి
ములాయం
నాయకత్వంలోని
సమాజ్
వాదీ
పార్టీ
17
సీట్లు
గెలుచుకుంది.
13
రోజుల
వాజ్
పేయ్
ప్రభుత్వం
కూలిపోయే
సమయానికి
లోక్
సభలో
కాంగ్రెస్
కు
141,
బీజేపీకి
161
సీట్ల
సంఖ్యా
బలం
ఉంది.
ఆ
సమయంలో
మరోసారి
ప్రధాని
పదవికి
వీపీ
సింగ్
తిరస్కరించారు.
దీంతో..నాటి
పశ్చిమ
బెంగాల్
సీఎం
జ్యోతిబసు,
సీపీఎం
నేత
హరికిషన్
సింగ్
సూర్జీత్
భాగస్వామ్య
పక్షాలతో
చర్చలు
చేసారు.
ములాయంను
ప్రధాని
చేసేందుకు
సూర్జీత్
ఏకాభిప్రాయానికి
ప్రయత్నించారు.
కానీ,
అదే
సమయంలో
కీలక
పరిణామాలు
చోటు
చేసుకున్నాయి.
అంతర్గతంగా
భాగస్వామ్య
పక్షాల
మధ్య
ఎవరికి
ప్రధాన
మంత్రి
పదవిని
ఎంపిక
చేయాలనే
అంశం
పైన
తమిళ
మనీల
కాంగ్రెస్
నేత
జీకే
ముపనార్..
ములాయం
మధ్య
పోటీ
జరిగింది.
ఓటింగ్
నిర్వహించారు.

చివరి నిమిషంలో మారిన సమీకరణాలు
అందులో
120-20
ఓట్ల
తేడాతో
ములాయం
అభ్యర్ధిత్వానికి
మద్దతు
లభించింది.
కానీ,
లాలూ
ప్రసాద
యాదవ్
-
శరద్
యాదవ్
మాత్రం
ములాయం
ప్రధాని
అయ్యేందుకు
అంగీకరించలేదు.
నాడు
కూటమిలో
కీలకంగా
వ్యవహరించిన
టీడీపీ
అధినేత
చంద్రబాబు
కూడా
అంగీకరించలేదని
అప్పట్లో
ప్రముఖ
జాతీయ
పత్రికలో
కధనాలు
వచ్చాయి.
ములాయంకు
నాడు
ప్రధాని
పదవి
దక్కి
ఉంటే
గుజ్రాల్
కంటే
ఎక్కువ
కాలం
పదవిలో
కొనసాగేవారని
ఆ
కధనం
సారాంశం.
ఆ
సమయంలో
కేంద్రంలో
నెలకొన్న
కూటమి
రాజకీయాల్లో
చంద్రబాబు
కింగ్
మేకర్
గా
వ్యవహరించారు.
కాంగ్రెసేతర
పార్టీలను
కూడగట్టడం,
కేంద్రంలో
ప్రభుత్వాలను
ఏర్పరచడంలో
చంద్రబాబు
కీలకపాత్ర
పోషించారు.
యునైటెడ్
ఫ్రంట్
ప్రభుత్వానికి
బయట
నుంచి
మద్దతు
ఇచ్చేలా
కాంగ్రెస్
పార్టీని
ఒప్పించారు.

కింగ్ మేకర్ గా నాడు చంద్రబాబు
ఇందులో
భాగంగా
దేవెగౌడ
ప్రధాని
అయ్యారు.
ఆ
తర్వాత
దేవెగౌడను
మార్చాలని
కాంగ్రెస్
పట్టుపట్టడంతో,
తదుపరి
ప్రధానిగా
ఐకే
గుజ్రాల్
ఎంపికలో
చంద్రబాబు
ప్రముఖ
పాత్ర
పోషించారు.
పోషించాడు.
ఈ
రెండు
సందర్భాల్లో
వామపక్షాలు,
ఇతర
ప్రాంతీయ
పార్టీలను
ఐక్యంగా
ఉంచడానికి
జాతీయ
కన్వీనర్‌గా
చంద్రబాబు
బాధ్యత
తీసుకున్నారు.
ఒక
దశలో
చంద్రబాబుకు
ప్రధాని
పదవి
కోసం
ప్రతిపాదన
వచ్చింది.
కానీ,
జాతీయ
రాజకీయాల్లో
ఏం
జరగబోతుందో
స్పష్టత
ఉండటంతో..చంద్రబాబు
దానిని
నిరాకరించారు.
ఇప్పుడు
ములాయం
మరణం
వేళ..నాడు
చోటు
చేసుకున్న
పరిణామాలు
రాజకీయంగా
చర్చల్లో
నిలుస్తున్నాయి