leader: ఇంటి నుంచి వెళ్లిన లీడర్ నదిలో ఎలా శవమైనాడు, పక్కాప్లాన్ తో చంపేశారా ? ఏం జరిగింది !

బెంగళూరు/ మంగళూరు: కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరుసగా హిందూ సంఘ, సంస్థ నాయకులు, కార్యకర్తలు హత్యకు గురికావడం కలకలం రేపింది. ఇదే సమయంలో ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నారని పలువురిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి సమయంలో భజరంగ్ దళ్ నాయకుడు నదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. హిందూ సంఘ, సంస్థ నాయకులు వరుస హత్యలకు గురి కావడం, కొందరు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడంతో సాటి హిందూ నాయకులు మడలిపోతున్నారు.

భజరంగ్ దళ్ లీడర్

భజరంగ్ దళ్ లీడర్

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో గురువారం నేత్రావతి నదిలో బజరంగ్ దళ్ నాయకుడి మృతదేహం లభ్యం కావడంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భజరంగదల కల్క్ డ్క చెందిన భజరంగ్ దళ్ నాయకుడు, గో సంరక్షక్ నాయకుడు రాజేష్ పూజారి అలియాస్ రాజేష్ అనే యువకుడు (26) బంట్వాళ్ తాలూకాలోని పానే మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిలో శవమై కనిపించాడు.

నదిలో శవమైన లీడర్

నదిలో శవమైన లీడర్

పానేమంగళూరు పాత వంతెన సమీపంలో నేత్రావతి నదిలో రాజేష్ మృతదేహం లభ్యకావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఫ్లైఓవర్ కింద బైక్ కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా నదిలో భజరంగ్ దళ్ నాయకుడు రాజేష్ మృతదేహం లభ్యమైంది.

బైక్ తో పాటు పడిపోయాడా ? లేదంటే

బైక్ తో పాటు పడిపోయాడా ? లేదంటే

రాజేష్ పూజారి అలియాస్ రాజేస్ ప్రమాదవవాత్తు మృతి చెందాడా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక హత్య చేసి శవంతో పాటు బైక్ కూడా నదిలో విసిరేశారా అని అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. బంట్వాళ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ ఇంటి నుంచి బైక్ లో బయలుదేరాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆ సమయంలో రాజేష్ బైక్ పాత పానె మంగళూరు వంతెనను ఢీకొని నేత్రావతి నదిలో పడిపోయి ఉంటుందని, ఆ ప్రమాదంలో రాజేష్ మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న వయసులో పవర్ ఫుల్ లీడర్

చిన్న వయసులో పవర్ ఫుల్ లీడర్

రాజేష్ బైక్ ప్రమాదంపైనా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. లేక రాజేష్ చనిపోవడానానికి మరేదైనా కారణం ఉందా? అంటూ పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజేష్ భజరంగ్ దళ్ లో బాధ్యతాయుతమైన నాయకుడిగా పని చేస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు, హిందూ మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడని, అతన్ని హత్య చేసి ఉంటారని కొందరు భజరంగ్ దళ్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+