వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎందుకు సెమీ ఫైనల్ ? 2024 పోరుకు ఎలా నిర్ణయాత్మకం కానున్నాయి ?

|
Google Oneindia TeluguNews

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ లో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఏడు దశల షెడ్యూల్ ను ఈసీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటున్న ఈ ఎన్నికలకు ఉన్న ప్రత్యేకత ఏంటి ? 2024 ఎన్నికలకు ఇవి సెమీఫైనల్ గా ఎందుకు మారబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 ఐదు రాష్ట్రాల పోరు

ఐదు రాష్ట్రాల పోరు

ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు ఈ ఏడాది మార్చితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఈ ఎన్నికలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి నెలకొంది. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు తృణమూల్, ఆప్ వంటి నిర్ణయాత్మకంగా మారుతున్న పార్టీలకు సైతం ఈ ఎన్నికలు ప్రధానంగా మారిపోయాయి. దీంతో ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని లైట్ తీసుకునేందుకు రాజకీయ పార్టీలు ససేమిరా అంటున్నాయి.

కాంగ్రెస్, బీజేపీకి చావో రేవో

కాంగ్రెస్, బీజేపీకి చావో రేవో


కాంగ్రెస్, బీజేపీ రూపంలో రెండు రెండు జాతీయ పార్టీలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు చావోరేవోగా మారిపోయాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, పంజాబ్‌లో కాంగ్రెస్. బీజేపీ పోరు ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌కు ఉన్న 52 లోక్‌సభ స్థానాల్లో పదకొండు - 20% - పంజాబ్‌ నుంచి ఉన్నాయి. బీజేపీకి ఉన్న 301 లోక్‌సభ స్థానాల్లో 62 అంటే 20% ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చాయి. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మాదిరిగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ రెండు రాష్ట్రాల్లో పరస్పరం తలపడటం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాల హవా నడుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) జనాలను ఆకర్షిస్తోంది, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చర్చనీయాంశంగా ఉంది. కానీ ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే పైచేయి కనిపిస్తోంది.

నాయకత్వ సవాళ్లు

నాయకత్వ సవాళ్లు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే, యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోడీకి కాబోయే వారసుడిగా మారబోతున్నారు. ఇటీవలి కాలంలో యోగీ బ్రాండ్ ప్రచారం దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీతో పాటు దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగేలా చేస్తోంది. పార్టీలోని ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా. యోగీ ఆదిత్యనాథ్ ఇప్పటికే మోడీ నీడకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ వ్యూహానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అలాగే ఆమె పంజాబ్‌లో పార్టీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఎన్నుకున్నారు. పార్టీ పనితీరు ఆమె నాయకత్వ నైపుణ్యాలను, ఆమె పాత్రపై చర్చలను ఈ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి.

 దళిత రాజకీయాలు

దళిత రాజకీయాలు

కొన్నాళ్ల క్రితం వరకు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధిపత్యంలో ఉన్న దళిత రాజకీయాలు ఇప్పుడు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో గతంలో చాలాసార్లు అధికారంలో ఉన్న బీఎస్పీ అంతిమంగా పతనమయ్యేలా కనిపిస్తోంది. అది పంజాబ్‌లోనూ బలమైన ఉనికిని కలిగి ఉన్నా ఎన్నడూ అధికారాన్ని మాత్రం దక్కించుకోలేదు. యూపీలో బీఎస్పీ పతనంతో దళితుల్లో బీజేపీ గణనీయమైన ఓట్లు సంపాదించుకుంది. పంజాబ్‌లో దళితులు గతంలో కాంగ్రెస్‌కు ఎక్కువగా ఓటు వేశారు, దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించిన నేపథ్యంలో వారిని సంఘటితం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుంచి దళిత రాజకీయాలు ఎలా రూపుదిద్దుకుంటాయో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ దళితుల్లో తమ ఆదరణ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Recommended Video

Covid-19 Third Wave In India,Daily Cases Could Reach 10 Lakh | Oneindia Telugu
కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి

కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి


కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. వీరిలో ఒకరు ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కాగా.. మరొకరు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వీరిద్దరూ ఇప్పుడు ఐదు రాష్ట్రాల పోరులో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కేజ్రివాల్ పంజాబ్ లోనూ, మమత గోవాలనూ సత్తా చాటుకునేందుకు శ్రమిస్తున్నారు. ఈ పోరులో వీరిద్దరూ విజయవంతమైతే కచ్చితంగా రాబోయే రోజుల్లో జాతీయస్ధాయిలో ప్రత్యామ్నాయ కూటమి నెలకొల్పడంలో కీలకంగా మారిపోతారు. అందుకే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ స్ధాయిలో ప్రత్యామ్నాయంపైనా ఆశలు రేపుతున్నాయి.

English summary
ec has annouced schedule for semi final like five state assembly eletions today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X