రూ. కోట్లలో ఆస్తి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది ?, క్రిమినల్ కేసుల్లో రికార్డు బ్రేక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇప్పటికే ప్రభుత్వంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసినా వారికి శాఖలు ఇంకా కేటాయించలేదు. మరో 20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి రంగం సిద్దం అవుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపోందిన వారి మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2018లో క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న నాయకలు ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయ్యారని ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది.

కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. బెంగళూరు నగరంలోని సర్వజ్ఞనగర అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే కేజే. జార్జ్ మినహా మిగిలిన 223 మంది ఎమ్మెల్యేల వివరాలు పరిశీలించిన ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది. కర్ణాటకలో ఎంత మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ?, ఎంత మంది ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలకు పడగలు ఎత్తారు అనే పూర్తి సమాచారం బయటకు వచ్చింది.
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న 122 మంది నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న 77 మంది నాయకులు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయ్యారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న 71 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి క్రిమినల్ కేసులు ఉన్న 54 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. 2018తో పోల్చుకుంటే 2023లో ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు అయిపోయారు.

హత్య కేసు నమోదు అయిన ఒక ఎమ్మెల్యే, హత్యాయత్నం కేసులు నమోదు అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మహిళల మీద దౌర్జన్యాలు చేశారని 7 మంది ఎమ్మెల్యేల మీద కేసులు నమోదు అయ్యాయి, అత్యాచారం చేశారని ఒక ఎమ్మెల్యే మీద కేసు నమోదు అయ్యింది. మొత్తం మీద 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు చాలా మంది ఎమ్మెల్యేలు అయిపోయారు.
* క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు: కాంగ్రెస్ లో 78 మంది, బీజేపీలో 34 మంది, జేడీఎస్ లో 9 మంది, కేఆర్ పీపీలో 1 ఎమ్మెల్యే ఉన్నారు.
* 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 215 మంది కోటీశ్వరులు ఎమ్మెల్యేలు అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 217 మంది కోటీశ్వరులు ఎమ్మెల్యేలు అయ్యారు.
* కాంగ్రెస్ పార్టీలో 132 మంది కోటీశ్వరులు, బీజేపీలో 63 మంది కోటీశ్వరులు, కేఆర్ పీపీలో 1 ఎమ్మెల్యే, సర్వోదయ కర్ణాటక పార్టీలో ఓ ఎమ్మెల్యే, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు కోటీశ్వరులు అని ఏడీఆర్ నివేదిక తెలిపింది.
* 1వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) లోపు చదివిన ఎమ్మెల్యేలు 79 మంది, డిగ్రీ చేసిన ఎమ్మెల్యేలు 139 మంది, డిప్లొమా చేసిన ఎమ్మెల్యేలు ముగ్గురు కర్ణాటక అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు.
* 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఎమ్మెల్యేలు 64 మంది, 51 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు ఉన్న ఎమ్మెల్యేలు 156 మంది, 80 ఏళ్ల దాటిన ఎమ్మెల్యేలు ముగ్గురు కర్ణాటక అసెంబ్లీలో ఉన్నారు.
* కర్ణాటకలో అసెంబ్లీలో 224 మంది ఎమ్మెల్యేల్లో 213 మంది పురుఫులు, 10 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.












Click it and Unblock the Notifications