వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మల విసర్జన

ఎంతసేపటికి ఒకసారి మల విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లాలి? ఈ ప్రశ్నను మీరు గూగుల్‌ను అడిగితే చాలా సమాధానాలు వస్తుంటాయి.

రోజులో మూడుసార్లు టాయిలెట్‌కు వెళ్లమని కొందరు నిపుణులు సూచిస్తుంటే.. మూడు రోజులకు ఒకసారి వెళ్లాలని కూడా కొందరు చెబుతుంటారు.

ఈ ప్రశ్నకు సరైన సమాధానం అంటూ ఏమీ ఉండదు. ఇదొక సహజమైన ప్రక్రియ. ఇది సహజసిద్ధంగా జరిగిపోవాలంతే. కొన్నిసార్లు మాత్రం కొందరు పట్టుపట్టుకొని టాయిలెట్‌కు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఆపుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా బలవంతంగా ఆపుకుంటే బోవెల్ క్యాన్సర్, మూల వ్యాధి, పేగుల్లో చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడటం లాంటి సమస్యలు చుట్టుముట్టే ముప్పుంది.

కాబట్టి టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి.

మల విసర్జన

20వ శతాబ్దం మొదట్లో మనం తీసుకునే ఆహారం కడుపులో ఎలా ముందుకు వెళ్తుందో పరిశోధకులు గ్రహించారు. దీన్ని గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటారు. ఉదయం తీసుకునే అల్పహారం పేగుల్లో వేగంగా ముందుకు వెళ్తుందని పరిశోధనల్లో రుజువైంది.

తమ కడుపును శుభ్రం చేసుకోవాలని మెదడు సంకేతాలు పంపినప్పుడు చిన్నపిల్లలు ఆటోమేటిక్‌గా మల విసర్జన చేస్తారు. దీని కోసం వారేమీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు.

అయితే, నడక నేర్చుకున్న తర్వాత వారు మల విసర్జనను ఆపుకోవడం నేర్చుకుంటారు.

జీర్ణ వ్యవస్థతోపాటు కడుపును నియంత్రించడమనేది మానవ పరిణామ క్రమంలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే, కొంతమందికి నియంత్రణ మరీ ఎక్కువవుతుంటుంది. మల విసర్జనకు వెళ్లాలని శరీరం చెబుతున్నప్పటికీ, ఇది సరైన సమయం కాదని కొందరు ఆపుకుంటారు.

మల విసర్జన

చాలా కారణాలున్నాయి..

అయితే, మల విసర్జన అనేది సమయానికి జరగకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని..

  • మలబద్ధకం
  • కడుపునొప్పి
  • మల విసర్జనలో క్రమశిక్షణ పాటించకపోవడం
  • కడుపులో వాపు
  • గ్యాస్
  • కడుపులో ఆహారం వేగంగా ముందుకు కదలకపోవడం

అర్థం చేసుకోవాలి

ఎంత సేపటికి ఒకసారి టాయిలెట్‌కు వెళ్లాలనే అంశంపై ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునే ఆహారం మలం రూపంలో బయటకు రావడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం.

అంటే మనం తీసుకుంటున్న ఆహారం.. మల ద్వారం గుండా ఎంతసేపటి తర్వాత బటయకు వస్తుందో మనం గమనించాలి.

ఈ సమయాన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలని అనిపిస్తుంది. అప్పుడు డయేరియా లేదా మలబద్ధకం లాంటి సమస్యలేవో పీడిస్తున్నాయనే విషయం మనం గ్రహించాలి.

ఈ సమయాన్ని గుర్తించడం చాలా తేలిక. ఏదైనా ఒక మొక్కజొన్న గింజను మింగండి. మలంలో అది ఎప్పుడు వస్తుందో చూడండి.

ఎంత సేపటి తర్వాత వస్తుంది? ఎనిమిది నుంచి 24 గంటలకు అటూఇటుగా అది బయటకు వస్తుంది.

స్పీడ్ తక్కువైతే..

ఎప్పుడు టాయిలెట్‌కు వెళ్లాలని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కడుపును ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో దాదాపు అందరికీ తెలుస్తుంది.

కాబట్టి మల విసర్జనను ఎప్పుడూ ఆపుకోకూడదు. ఒక అలా అపుకుంటే ఆహారం నుంచి విడులయ్యే వ్యర్థాలు మన శరీరంలో అలానే ఉండిపోతాయి.

సమయం గడిచేకొద్దీ సమస్య మరింత తీవ్రం అవుతుంది.

సగటున ప్రతి మనషీ తన జీవిత కాలంలో ఆరు టన్నుల మలాన్ని విసర్జిస్తారు. ఈ మలంలో నీరు, బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు, జీర్ణంకాని ఆహారం, కొవ్వులు ఉంటాయి.

మన శరీరంలో ఎక్కువసేపు అలానే ఉంటే, ఇది కుల్లిపోతుంది.

దీని నుంచి గ్యాస్ విడుదల అవుతుంది. మెటబోలైట్స్‌గా పిలిచే రసాయనాలు కూడా దీని నుంచి ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయనాలు పేగుల్లోని గోడలను దెబ్బతీస్తాయి.

అది పెద్ద సమస్యే..

మలం వల్ల పెద్ద పేగుల్లో రసాయనాలు పేరుకొని అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

శరీరంలో రక్తం, ఎల్లో బైల్, బ్లాక్ బైల్ లాంటివి సమతూకంలో ఉండాలని గ్రీకుల కాలంనాటి రచనలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సమతూకం తప్పనిసరి.

మలబద్ధకాన్ని తగ్గించడంలో తృణధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒకవేళ మలం బయటకు రావడం ఆలస్యమైతే చాలా రోగాలు మనల్ని చుట్టుముడతాయి. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కడుపులోని బాక్టీరియా అస్తవ్యస్తమైనా మలం బయటకు రావడానికి ఆలస్యమవుతుందని పరిశోధనల్లో రుజువైంది.

ఏం చేయాలి?

మల బద్ధకాన్ని నివారించేందుకు ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

పానీయాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.

కడుపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

మలం వచ్చినట్లు అనిపించిన వెంటనే, ఆపుకోకుండా టాయిలెట్‌కు వెళ్లాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How many times a day should defecation be done
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X