పాన్ కార్డ్ లేకుండా బంగారం ఎంత కొనొచ్చు?
రూ.2,000 నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణి నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2,000 నోట్లను ఖర్చు చేసేందుకు తొందరపడుతున్నారు. చాలా మంది బంగారాన్ని కొనేందుకు రూ.2,000 నోట్లను షాపులకు తీసుకెళ్తున్నారు. డబ్బులతో బంగారాన్ని కొనేందుకు ఉన్న పరిమితులు తెలుసుకుందాం.

రత్నాభరణాల రంగాన్ని ప్రభుత్వం 2002లో 'అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA)' పరిధిలోకి తీసుకొచ్చింది. ఇందుకు 2020 డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక పరిమితికి మించిన డబ్బులతో కొనుగోలు చేసే వారి నుంచి ఆభరణాల సంస్థలు పాన్‌కార్డు, ఆధార్ కార్డు వంటి కేవైసీ డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. రూ.10 లక్షలకు మించి కొనుగోలు చేసేవారి వివరాలను షాపుల యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించాలి. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లేకుండా ఎంత డబ్బులతో జ్యూయలరీ కొనొచ్చో తెలుసుకుందాం.

ఆదాయ పన్ను సెక్షన్ 269ఎస్‌టీ ప్రకారం.. జ్యూయలరీ కొనుగోలులో ఒక వ్యక్తి ఒకరోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బులతో లావాదేవీ జరపడానికి అనుమతి లేదు. ఒకవేళ రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బులతో జ్యూయలరీ కొనుగోలుచేస్తే ఆదాయ పన్ను శాఖ నిబంధనల్ని అతిక్రమించినట్లవుతుంది. ఎవరైతే డబ్బులను స్వీకరించారో వాళ్లు లావాదేవీ మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బుతో జ్యూయలరీ కొనాలంటే పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. డబ్బులిస్తున్నారా? లేదంటే ఆన్ లైన్ ట్రాన్స్ ఫరా? అన్నదాంతో సంబంధం ఉండదు. రూ.2 లక్షలు దాటితే పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు సమర్పించాలి.












Click it and Unblock the Notifications