వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలుకు శశికళ!: వెలుగులోకి మరో రెండు ఆసక్తికర విషయాలు

అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఆమెను త్వరలో అరెస్టు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు ఓ భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఆమెను త్వరలో అరెస్టు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు ఓ భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఇప్పుడు మద్దతు తెలిపినప్పటికీ తమకు మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కుతుందా లేదా అనే డైలమాలో శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు.

<strong>రాజకీయ నేతలకు గుణపాఠం: శశికళపై స్టాలిన్, స్వీట్లు పంచారు</strong>రాజకీయ నేతలకు గుణపాఠం: శశికళపై స్టాలిన్, స్వీట్లు పంచారు

అయితే, వారంలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించనున్న నేపథ్యంలో.. సీఎం ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు అందరూ శశికళ చెప్పినట్లు పళనిస్వామి వైపు ఉంటారా లేక పన్నీరు వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

How much is camp Sasikala’s resort bill

మరోవైపు, శశికళ ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రీసార్టులో ఉంచారు. ఇప్పుడు శశికళ జైలుకు వెళ్లడం ఖాయం కావడంతో ఆ రిసార్ట్ బిల్లు ఎవరు చెల్లిస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శశికళ బిల్లును చెల్లించలేరు. ఆమె కుటుంబ సభ్యులు కూడా చెల్లించే అవకాశం లేదు.

ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ అత్యాధునితతో కూడుకున్నది. ఎన్నో సదుపాయాలతో విలాసవంతంగా గడిపేందుకు ఆ రిసార్టుకు ఎమ్మెల్యేలు వెళ్లారు. గోల్డెన్ బే రిసార్టు బీచ్ ఒడ్డున ఉంది. ఒక్కో రూంకు రోజుకు రూ.7వేలు అద్దె చెల్లిస్తామని శశికళ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.

<strong>అరెస్టుకు రంగం సిద్ధం: ఇప్పుడు శశికళ ఏం చేయవచ్చు?</strong>అరెస్టుకు రంగం సిద్ధం: ఇప్పుడు శశికళ ఏం చేయవచ్చు?

గోల్డెన్‌ బే బీచ్‌ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 200 మంది ఆరు రోజుల పాటు బస చేశారు. మూడు విభాగాల్లో రోజుకు గది అద్దె రూ.10,000-7000 మధ్య ఖరీదు చేసే అరవై గదులున్నాయి. ఎక్కువ గదులు ఒకేసారి బుక్‌ చేసుకున్నందున అన్నిటినీ ఒకే రేటులో కనీసం ఏడువేలకు బుక్‌ చేసుకున్నా పాతిక లక్షల వరకు అవుతుంది.

ఈ లెక్క ప్రకారం ఆరు రోజులు రిసార్టులో ఉన్నారు. దీనికి గాను రూ.25 లక్షల వరకు చెల్లించవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవించారు. ఎమ్మెల్యేలు కోరిందల్లా ఇచ్చారు.

యువతులతో ప్రోగ్రాంలు కూడా పెట్టారు. ఖరీదైన మద్యం అందించారు. దీంతో తడిసి మోపెడు అయింది. రిసార్టు బిల్లు దాదాపు రూ.50 లక్షల వరకు అయిందని, ఈ బిల్లును ఎలా చెల్లిస్తారనే చర్చ సాగుతోంది. పార్టీ నిధుల నుంచి చెల్లించేలా పన్నీరుపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

English summary
How much will a stay of more than 200 people, including 100 legislators, for six days and nights at a luxurious beach resort on East Coast Road cost?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X