Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెండు ప్రకటనలతో గందరగోళం సృష్టించిన జైష్ ఉగ్రవాది అదిల్ తండ్రి

గురువారం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు జైషే మహ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్. ఈ దాడులపై అదిల్ తండ్రి గులామ్ దార్ స్పందించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటో తెలుసా...?

తన కొడుకు అదిల్ అహ్మద్ దార్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు తనకు తెలియదని గులామ్ దార్ చెప్పాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన తన కొడుకుకు ఉగ్రవాద మూలాలు లేవని చెప్పాడు. అనంతరం మరో జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన కొడుకుని భద్రతాబలగాలు పట్టకుని చిత్రహింసలకు గురిచేశాయని అందుకే తాను ఉగ్రవాదులతో కలిసి పయనించాలనే ఆలోచనకు వచ్చి ఆ మేరకు జైషే మహ్మద్ సంస్థలో చేరినట్లు చెప్పాడు.

How Pulwama bomber Adil Ahmad Dars father made different claims about son joining Jaish

"కశ్మీర్ లోయలో భద్రతా దళాలు నా కొడుకుని పట్టుకుని చితకబాదారు చిత్రహింసలకు గురిచేశారు. అందుకే తను ఉగ్రవాద సంస్థలతో కలిసి నడుస్తానని చెప్పేవాడు. " అని గులాందార్ వెల్లడించాడు. ఒక మీడియాతో ఒకలా చెప్పి మరో మీడియా ఛానెల్‌తో మాట్లాడినప్పుడు మరోలా మాట్లాడి గందరగోళం సృష్టించాడు. అదిల్ తల్లి కూడా భారత బలగాలు తన కొడుకును పట్టుకుని చితకబాదారని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే గురువారం పూల్వామా జిల్లాలోని అవంతిపురా సెక్టార్‌ో ఓ కారులో పేలుడు పదార్థాలు ఉంచి సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపైకి దూసుకెళ్లడంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దాడిని ఖండిస్తూ తమ నివాళులు అర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+