ఆదిపురుష్ వివాదంలో కేంద్రం జోక్యం- సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు?
అమరావతి: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు.
నేపాల్ ప్రభుత్వం సైతం ఈ సినిమాపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీతమ్మతల్లి భారత్‌లో జన్మించినట్లు ఉన్న డైలాగ్‌ను తొలగించాలంటూ ఆదేశించింది నేపాల్. నిజానికి- సీతమ్మ జన్మించిన జనక్‌పూర్ ప్రస్తుతం నేపాల్‌లో ఉండటమే దీనికి కారణం. ఆ డైలాగ్‌ను తొలగించిన తరువాతే తమ దేశంలో ఈ సినిమాను ప్రదర్శించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అటు క్రిటిక్స్ ఆదిపురుష్‌పై చేస్తోన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రామాయణాన్ని సమూలంగా మార్చేసేలా ఈ కథను తీర్చిదిద్దారంటూ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా చూపిస్తోన్నారు. రామాయణాన్ని చివరికి ఓ కల్పిత గాథగా భావించేలా దర్శకుడు ఓం రౌత్ సినిమాను తీశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. బాబు గోగినేని వంటి హేతువాదులు సంధించే విమర్శలు మరో ఎత్తు.
मैंने 'आदिपुरुष' के बारे पढ़ा और सुना। अत्यधिक पीड़ा हो रही है कि आख़िर कैसे सेंसर बोर्ड ने एक ऐसी फ़िल्म को सर्टिफिकेट दे दिया जो हमारी आस्था से खिलवाड़ कर रही है, हमारे आराध्य का मजाक उड़ा रही है.
— Bhupesh Baghel (@bhupeshbaghel) June 17, 2023
केंद्र सरकार को इसका जवाब देना होगा.
हमारे भाँचा राम का अपमान हम नहीं सहेंगे.… pic.twitter.com/QA7yk9r7JY
తాజాగా ఆదిపురుష్‌పై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సైతం విమర్శలు చేశారు. ఆదిపురుష్ గురించి వార్తల్లో చదివానని, స్క్రిప్ట్ గురించి తెలుసుకున్నానని, కోట్లాదిమంది హిందువుల మనోభావాలను కించపరిచేలా సినిమా ఉందని అన్నారు. ప్రజల భక్తి, విశ్వాసాలతో ఆటలాడుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారాయన.
ఇలాంటి సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం బాధాకరమని భూపేష్ బఘేల్ అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, హిందువులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీరామచంద్రుడిని ఛత్తీస్‌గఢ్ ప్రజలు తమ మేనల్లుడిగా భావిస్తారని, అలాంటి రాముణ్ని అవమానిస్తే సహించబోమనీ తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి. దీనికి బాధ్యులైన వారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications