Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చాప కింద నీరులా..

Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి కొరడా ఝుళింపించారు. అనేక దేశాలపై కొత్తగా అదనపు వడ్డింపులు వడ్డించారు. భారీగా టారిఫ్‌ను పెంచారు. ఈ జాబితాలో భారత్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 26 శాతం మేర టారిఫ్ విధించారు భారత్‌పై.

2వ తేదీ నుంచే..

మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్. 25 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై మార్చి 31వ తేదీన సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

How the India s market hit by the tariffs announced by Donald Trump

26 శాతం వరకు..

అక్కడితో ఆగట్లేదాయన. ఇప్పుడు కొత్తగా భారత్‌పై 26 శాతం వరకు టారిఫ్ విధించారు. భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఈ పన్ను వర్తిస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న టారిఫ్‌కు మరో 26 శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

వెరీ వెరీ టఫ్..

ఈ సందర్భంగా వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ట్రంప్. మేక్ అమెరికా వెల్తీ అగైన్ కాన్సెప్ట్ గురించి వివరించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై భారత్ విధించిన పన్నులు వెరీ వెరీ టఫ్ అంటూ మండిపడ్డారు. ఈ ఉద్దేశంతోనే తాము కూడా రెసిప్రోకల్ (పరస్పర) టారిఫ్‌ను పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్.

అన్ని రకాల దిగుమతులపై..

భారత్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపైనా 26 శాతం టారిఫ్ వర్తిస్తుందని వెల్లడించారు. అయినప్పటికీ- ఇది తమ ఉత్పత్తులపై భారత్ వసూలు చేస్తోన్న టారిఫ్‌లో సగం మాత్రమేనని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశ ఉత్పత్తులపై భారత్ విధించిన పన్నులతో పోల్చుకుంటే ఈ మొత్తం తక్కువేనని వ్యాఖ్యానించారు. తమపై భారత్ 52 శాతం పన్నులను విధిస్తోందని పేర్కొన్నారు.

How the India s market hit by the tariffs announced by Donald Trump

మంచి మిత్రుడే అయినా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని ప్రశంసించారు. స్నేహితుడే అయినప్పటికీ తమను సరిగ్గా ట్రీట్ చేయట్లేదని, వైట్ హౌస్‌లో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని ఆయనతోనే చెప్పానని వివరించారు.

కనిష్టంగా 10 శాతం వరకు టారిఫ్‌..

భారత్‌తో పాటు దాదాపు అన్ని దేశాల దిగుమతులపై కనిష్టంగా 10 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు డొనాల్డ్ ట్రంప్. ఆయా దేశాలు విధించిన టారిఫ్‌‌ను బట్టి చూస్తే- ఇది దారుణమైన అసమతౌల్యమని పేర్కొన్నారు. తాము వసూలు చేస్తోన్న టారిఫ్‌కు మించి ఆయా దేశాలు పన్నులను విధిస్తోన్నాయని అన్నారు.

50 సంవత్సరాలకు పైగా దోపిడీ..

తమ దేశ పౌరుల పన్నులను ఇతర దేశాలు దోచుకుంటున్నాయని, ట్యాక్స్‌పేయర్లు 50 సంవత్సరాలకు పైగా దోపిడీకి గురవుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఇకపై అలా జరగదని తేల్చి చెప్పారు.

అతిపెద్ద వాణిజ్య భాగస్వామి

2021 నుండి 2024 వరకు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.. భారత్‌. 2023లో వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం 190.08 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికాతో 43.65 బిలియన్ల డాలర్ల మేర ఎగుమతులు- దిగుమతులు కొనసాగుతున్నాయి. 83.77 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది భారత్. అలాగే- 40.12 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది.

మార్కెట్‌‌లో ప్రకంపనలు..

తాజాాగా విధించిన ఈ టారిఫ్ వల్ల దేశీయ మార్కెట్‌ ప్రకంపనలకు గురి అవుతోంది. సెన్సెక్స్.. మైనస్‌లో ట్రేడ్ అవుతోంది. కీలక రంగాలకు సంబంధించిన షేర్లు డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయి. ఇన్‌ట్రా డే ట్రేడింగ్ మొత్తం రెడ్ సర్కుట్‌లోనే కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్ సహా..

ఈ టారిఫ్ వల్ల టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, వజ్రాలు, బంగారం, జ్యువెలరీ ఎగుమతిదారులకు ఎదురుదెబ్బ తగులుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఆయా రంగాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి అనుగుణంగా ఆయా సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు క్షీణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు..

దేశీయ మార్కెట్ కార్యకలాపాలపై ట్రంప్ విధించిన టారిఫ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని బ్యాంకింగ్ ఎక్స్‌పర్ట్ అజయ్ బగ్గా వెల్లడించారు. టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, డైమండ్స్, జ్యువెలరీ ఎగుమతిదారులపై తక్షణ ప్రభావం పడుతుందని, వాళ్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు.

అమ్మకాల ఒత్తిడి..

ఇప్పటికే మెటల్, ఆయిల్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని చవి చూస్తున్నాయని, ఫార్మా రంగ కంపెనీలపైనా దీని ప్రభావం ఉండొచ్చని అజయ్ బగ్గా విశ్లేషించారు. అమెరికాలో పెరిగిన టారిఫ్ భారం.. ఎగుమతిదారులపై పడుతుందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.

Take a Poll

లాభాలు తగ్గిపోయే అవకాశం..

అధిక టారిఫ్‌ల వల్ల భారత ఎగుమతులు తగ్గుతాయని, దీనివల్ల ఎగుమతిదారుల లాభాలు తగ్గిపోయే అవకాశం ఉందని అజయ్ బగ్గా అంచనా వేశారు. దీనివల్ల ఇన్వెస్టర్లు.. బంగారం, బాండ్ల వైపు తమ పెట్టుబడులను మళ్లించే అవకాశం ఉందని, ఫలితంగా అప్పర్ సర్కుట్‌లో కొనసాగుతున్న మార్కెట్ పోర్ట్‌ఫోలియోలు కూడా ప్రభావితం కావొచ్చని అన్నారు.

అనిశ్చితికి..

దేశీయ మార్కెట్‌లో అనిశ్చితికి తాజా టారిఫ్ తెర తీసినట్టయిందని అజయ్ బగ్గా వెల్లడించారు. నేడు స్టాక్ మార్కెట్ కూడా నష్టాలతో ఆరంభం కావడాన్ని ఆయన ఉదహరించారు. మదుపర్లు తమ షేర్లను అమ్ముకుని బంగారం వంటి సెగ్మెంట్లల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+