తులారాశి, వృశ్చిక రాశి ఆగస్టు నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుతమైన యోగాలు ఏర్పరుస్తుంటాయి. మరికొన్నిసార్లు కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలగజేస్తుంటాయి. యోగాల వల్ల కలిసివస్తే, కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. ఆగస్టులో తులారాశి, వృశ్చిక రాశివారికి జాతక ఫలం ఎలా ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తులా రాశి

(చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు)

తులా రాశి వారికి ఈ ఆగస్టు నెల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి మరియు శత్రు విజయాన్ని సాధించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.దశమ స్థానంలో గురువు ఉండటం, ఆరో ఇంట శని సంచారం వల్ల ఉద్యోగంలో మీ ఆధిక్యం పెరుగుతుంది. బాధ్యతలు, పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసు రాజకీయాలను సమర్థవంతంగా తిప్పికొడతారు. ఆదాయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తుల ద్వారా లేదా పాత బాకీలు వసూలవడం ద్వారా ధన లాభం ఉంటుంది.

మిథున రాశి, కర్కాటక రాశి ఆగస్టు నెల పూర్తి జాతక ఫలం వివరాలు
మిథున రాశి, కర్కాటక రాశి ఆగస్టు నెల పూర్తి జాతక ఫలం వివరాలు
Horoscope Predictions and Results for these two zodiac signs libra and scorpio for august month

అయితే, అనవసర ఖర్చులు, వాహన రిపేర్లు లేదా వైద్య సంబంధిత ఖర్చులు రావచ్చు. అష్టమ కుజుని ప్రభావం వల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక అప్రమత్తత అవసరం. అగ్ని, విద్యుత్ ఉపకరణాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఉష్ణ సంబంధిత సమస్యలు రాకుండా నీరు ఎక్కువగా తాగాలి. సంభాషణల్లో కఠినత్వం తగ్గించుకోవాలి. అహంకార భావాలకు పోకుండా ఉండటం వల్ల జీవిత భాగస్వామితో మంచి బంధం ఉంటుంది. నెల చివరి వారంలో (ఆగస్టు 26 తర్వాత) గృహంలో శుభకార్య వాతావరణం నెలకొంటుంది. ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవికి లేదా లక్ష్మీదేవికి పూజ చేయడం, శుక్రుడి ధ్యానం లేదా బీజ మంత్రం జపించడం శుభ ఫలితాలను ఇస్తుంది.

వృశ్చిక రాశి

(విశాఖ 4వ పాదం, అనూరాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు)

వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెల (ముఖ్యంగా ద్వితీయార్థం) అత్యంత అద్భుతమైన ఫలితాలను, సరికొత్త విజయాలను తెచ్చిపెడుతుంది. ఆగస్టు 17 తర్వాత సూర్యుడు, ఆగస్టు 22 తర్వాత బుధుడు 10వ ఇంట ప్రవేశించడం వల్ల కెరీర్‌లో ఊహించని పురోగతి సాధిస్తారు. పై అధికారుల గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు లేదా బదిలీలు, ప్రమోషన్లు ఆశిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. 11వ ఇంట (లాభ స్థానం) శుక్రుడి అనుకూల సంచారం వల్ల వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కొత్త క్లయింట్లు లభిస్తారు.

మేష రాశి, వృషభరాశి ఆగస్టు నెల జాతకం పూర్తి వివరాలు
మేష రాశి, వృషభరాశి ఆగస్టు నెల జాతకం పూర్తి వివరాలు

ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు మాత్రం పత్రాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది. ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. నిలిచిపోయిన మొండి బకాయిలు చేతికి అందుతాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు ఉంటాయి. రాహువు ప్రభావం వల్ల గృహ అవసరాలకు లేదా వాహన రిపేర్లకు కొంత ఖర్చు కావొచ్చు. భాగ్య స్థానంలో గురు భగవానుని అనుగ్రహం ఉండటంతో ఉన్నత విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రతి మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించి, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+