కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
హుబ్బళి ధారవాడ మహానగర కార్పొరేషన్ కార్పోరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె నేహా హిరేమఠ్ అలియాస్ నేహాను ఓ ముస్లిం వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచి కిరాతకంగా హత్య చెయ్యడం కర్ణాటకలో కలకలం రేపింది. దీనిపై మృతురాలు నేహా తండ్రి, కార్పోరేటర్ నిరంజన్ స్వయంగా స్పందించారు. కన్న కూతురిని కోల్పోయిన ఆమె తండ్రి, ప్రముఖ కార్పోరేటర్ నిరంజన్ ఆర్తనాదాలు చెయ్యడం కలకలం రేపుతోంది.
కూతురు నేహా హత్యకు గురైన బాధలో కార్పోరేటర్ నిరంజన్ ఆయన కూతురి గురించి మాట్లాడారు. నా కూతురు హత్య వెనుక లవ్ జిహాద్ హస్తం ఉందనని కార్పోరేటర్ నిరంజన్ ఆరోపించారు. హంతకుడితో పాటు ముస్లీం వర్గానికి చెందిన నలుగురు నిందితులు ఉన్నారని, ప్రధాన నిందితుడు తన కూతురితో మాట్లాడటం చాలాసార్లు తాను చూశానని కార్పోరేటర్ నిరంజన్ మీడియాకు చెప్పాడు. ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయాలని నిరంజన్ మనవి చేశాడు.

నా కూతురు నేహాకు జరిగిన అన్యాయం మిగతా ఆడపిల్లలకు జరగకూడదని, నా కూతురు చాలా అమాయకురాలు అని, ఎరితోనూ గొడవపడే స్వభావం ఆమెకులేదని, ఆమెకు చాలా టాలెంట్ ఉందని ఆమె తండ్రి నిరంజన్ హిరేమఠ్ అన్నారు. లవ్ జిహాద్ కోణంలో తన కూతురు నేహానుప్రేమిస్తానని పీడీసీకి చెందిన నిందితుడు బెదిరించాడని, తరువాత అతన్ని నేను కూడా హెచ్చరించానని, నా కూతురు నేహా కూడా అతని ప్రేమను తిరస్కరించింది కార్పోరేటర్ నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన కూతురు అందరు అమ్మాయిల్లా చాలా సైలెంట్ గా ఉంటుందని, ఆమె క్రమం తప్పకుండా కాలేజీకి వెళుతోందని, మూడు నాలుగు రోజులుగా తన స్నేహితులతో కలిసి తన కూతురు నేహాను హత్య చెయ్యడనికి ప్లాన్ చేశారని ఆమె తండ్రి నిరంజన్ ఆరోపించారు. అనుకున్న ప్లాన్ ప్రకారం నిందితులు గురువారం వచ్చి తన కూతురు నేహాను హత్య చేశారని కార్పోరేటర్ నిరంజన్ విలపించారు. హుబ్బళిలోని కిమ్స్‌ను సందర్శించిన కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కాలేజ్ అమ్మాయి నేహా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కిమ్స్ కు వెళ్లిన మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ నేహా హత్య కేసు వివరాలను తెలుసుకున్నారు. కాలేజ్ అమ్మాయి నేహా హత్యను ఎవ్వరూ ఊహించలేని అత్యంత విషాదకరమైన షాకింగ్ సంఘటన అని బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు. నేహా హత్య కేసులో ఆమె దోషి కాదని, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత సురక్షితంగా ఉన్నారో అని కాలేజ్ అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, నేహా హత్య కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్కొ ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు.

సీఎం సిద్దరామయ్య ట్వీట్ చేసి తన బాధ్యత ముగిసినట్లే అని బావించారని, కాలేజ్ అమ్మాయి దారుణ హత్య కేసులో ఒక ముఖ్యమంత్రి ఇలాగేనా ప్రవర్తించేది అని బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి హత్యలు చేస్తున్న శక్తులకు ఆసరాగా నిలుస్తున్న వారిని ముందుగా నియంత్రించాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ డిమాండ్ చేశారు. సామూహిక హత్యలు హుబ్బళిలో సర్వ సాధారణం అయ్యాయని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ విచారం వ్యక్తం చేశారు.
హుబ్బళిలో పట్టపగలు కాలేజ్ అమ్మాయి నేహాని కాలేజ్ లోనే హత్య చెయ్యడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని మాజీ సీఎం బపవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. ఇలాంటి ఘటనల వల్ల సమాజంలో సామరస్యం లోపిస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని, ఎక్కడ చూసినా సామూహిక హత్యలు సర్వసాధారణం అయ్యాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications