వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్‌లో చైనా, పాక్‌ల భారీ ఉగ్రకుట్ర భగ్నం: అతిపెద్ద ఆయుధాల డంప్ స్వాధీనం!!

|
Google Oneindia TeluguNews

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఎత్తుగడలను భగ్నం చేయడంలో భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సఫలీకృతం అవుతున్నారు. నిత్యం జమ్మూకాశ్మీర్ కేంద్రంగా సాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లలో ఉగ్ర మూకను మట్టు పెట్టడమే కాకుండా, ఉగ్రవాదులకు సంబంధించిన అనేక రహస్య స్థావరాలు కనుక్కుంటూ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసే పనిలో పడ్డారు. ఎక్కడికక్కడ ఉగ్ర మూకను మట్టుబెడుతున్నారు.

ఉరీ లోని రాంపూర్ సెక్టార్ లో భారీ డంప్ స్వాధీనం చేసుకున్న ఆర్మీ

ఉరీ లోని రాంపూర్ సెక్టార్ లో భారీ డంప్ స్వాధీనం చేసుకున్న ఆర్మీ

తాజాగా బారాముల్లా లోని యురీ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు దాచిపెట్టిన భారీ ఆయుధాల డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రు దేశమైన పాకిస్థాన్, కుట్రలకు కేరాఫ్ అయిన డ్రాగన్ కంట్రీ తో కలిసి భారత్ పై దాడి కోసం దాచి పెట్టిన ఆయుధాల డంప్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ల నుండి అందిన సమాచారం మేరకు ఈ డంప్ ను స్వాధీనం చేసుకోగలిగారు అని ఆర్మీ ఇన్ఫాంట్రీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ చంద్ర పురియా పేర్కొన్నారు. యురీ లోని రాంపూర్ సెక్టార్, నియంత్రణ రేఖ వెంబడి అనేకసార్లు ఆకస్మిక దాడులు జరిపామని, అనేకమార్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు.

చైనా, పాకిస్థాన్ లకు చెందిన ఆయుధాల డంప్ స్వాధీనం

చైనా, పాకిస్థాన్ లకు చెందిన ఆయుధాల డంప్ స్వాధీనం

వీటిలో ఎనిమిది ఏకే 74 రైఫిల్స్, 24 ఏకే 74 రైఫిల్ మ్యాగజైన్లు, 7.62 ఎం ఎం ఏకే 24 లైవ్ అమ్యూనిషన్లు 560, పాకిస్తాన్ లో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు, చైనాలో తయారైన గ్రనేడ్లు, ఐ లవ్ పాకిస్తాన్ గుర్తు లతో కూడిన 82 బెలూన్లు, 12.30 ఎంఎం చైనీస్ పిస్టల్స్, 24 చైనా పిస్టల్స్ మ్యాగజైన్లు, భారీ మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ ఇన్ఫాంట్రీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ చంద్ర పురియా వెల్లడించారు.

ఎనిమిది గంటల సెర్చ్ ఆపరేషన్ .. ఆయుధాలు రికవరీ

ఎనిమిది గంటల సెర్చ్ ఆపరేషన్ .. ఆయుధాలు రికవరీ


తాజాగా హత్లంగా నాలా సాధారణ ప్రాంతంలో ఎనిమిది గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రికవరీ చేశామని ఆయన చెప్పారు. కాశ్మీరులోయలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి అని, దీంతో ఉగ్రవాదులలో నిరాశ వ్యక్తమవుతోందని మేజర్ జనరల్ అజయ్ చంద్ర పురియా వెల్లడించారు. ఎక్కడికక్కడ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టినట్టు ఆయన వివరించారు.

గతేడాది కూడా ఇదే సెక్టార్ లో ముగ్గురు ఉగ్రమూక హతం.. భారీ ఆయుధాలు స్వాధీనం

గతేడాది కూడా ఇదే సెక్టార్ లో ముగ్గురు ఉగ్రమూక హతం.. భారీ ఆయుధాలు స్వాధీనం


2021 లోనూ ఇదే సెక్టార్ లో జమ్ము కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు ఓ భారీ ఉగ్రదాడిని విఫలం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై ఉన్న యురీ సమీపంలోని రాంపూర్ సెక్టార్‌లో భారీగా ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించి భారత సైన్యం ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో భారీ ఉగ్రదాడి విఫలమైంది. వారి వద్ద నుండి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు. అప్పుడు ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల నుండి భారత సైన్యం 5 ఏ కె-47 లు, 8 పిస్టల్‌లు మరియు 70 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు మరోమారు భారీ ఆయుధాల డంప్ ను స్వాధీనం చేసుకుని ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది.

2023లో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇప్పటికే డిసైడైన కంపెనీలు; కరోనాతో కొత్త కష్టం!!2023లో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇప్పటికే డిసైడైన కంపెనీలు; కరోనాతో కొత్త కష్టం!!

English summary
Indian security forces foiled a major terrorist attack in Jammu and Kashmir. A huge arms dump belonging to China and Pakistan has been seized in Rampur sector near Uri in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X