వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ 'పాము'! ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి కుబుసం విడుస్తున్న బాలిక!

దేవాంకుర్‌, రాజ్‌ బహదూర్‌లు భార్యభర్తలు. వీరి స్వస్థలం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నౌవ్‌గాంగ్‌ అనే కుగ్రామం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. వీరికి లేక లేక పుట్టిన సంతానం షాలిని.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఛత్తర్‌పూర్‌‌: బాధలతో బతుకీడ్చడం కన్నా.. నాలుగు గోళీలు మింగి ప్రాణాలు తీసుకోవడం నయం.. కన్న కూతురి బాధను చూస్తున్న తల్లి గుండెకోత నుంచి వచ్చిన మాట అది. పేగు తెంచుకుని లోకాన్ని చూసిన నాటి నుంచి తన కూతురు నరకం అనుభవిస్తోందని షాలిని తల్లి దేవాంకుర్‌ కంటతడి పెట్టుకున్నారు.

నిజానికి ఆమె కంటి నుంచి రావడానికి ఏమీ లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఆవిరైపోయింది. దేవాంకుర్‌, రాజ్‌ బహదూర్‌లు భార్యభర్తలు. వీరి స్వస్థలం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నౌవ్‌గాంగ్‌ అనే కుగ్రామం. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. వీరికి లేక లేక పుట్టిన సంతానం షాలిని. షాలిని పుట్టుక వారిలో ఆనందాన్ని నింపలేదు. వారి జీవితాలను మరింత బాధల్లోకి నెట్టింది.

'Human snake' teen who sheds her skin every six weeks because of ultra-rare condition to get miracle treatment

కారణం షాలిని శరీరం పాము పొలుసుల్లా ఉండటం. ఆమె శరీరం నుంచి ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి చర్మం రాలిపోయి మళ్లీ వస్తుంటుంది. రోజులో గంటకోసారి స్నానం, మూడు గంటలకోసారి మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ను షాలిని శరీరమంతా రాసుకుంటుంది. లేకపోతే పొలుసుల చర్మం తేమ కోల్పోయి మంట పెడుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా గత పదహారేళ్లుగా షాలిని అమ్మ దేవాంకుర్‌ కూతురిని ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.

తొలుత ఓ మీడియా సంస్థ షాలిని దురవస్థను వెలుగులోకి తెచ్చింది. దీంతో స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఆమె 'రెడ్‌ మ్యాన్‌ సిండ్రోమ్‌' అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. వైద్యం చేయించేందుకు భారీగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో షాలిని తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి సుడులు తిరిగాయి.

దీంతో ఆసుపత్రి నుంచి వెనుదిరిగి ఇల్లు చేరారు. రెండు రోజుల అనంతరం వారికి ఓ ఫోన్‌ వచ్చింది. స్పెయిన్‌లోని ఓ ఆసుపత్రి షాలినికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిందనే శుభవార్త తెలిసింది. దీంతో షాలిని ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. షాలిని తర్వాత దేవాంకుర్‌, రాజ్‌ బహదూర్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారికి ఎలాంటి సమస్యలు లేవు.

English summary
A 'human snake' who sheds her skin every six weeks due to an ultra-rare condition is hoping for a miracle treatment in Europe. The horrific disorder has left 16-year-old Shalini Yadav unable to walk without a stick or straighten her limbs. She has to have a bath 24 times a day and slathers herself with moisturiser to stop her skin from hardening and seizing up. Her family are so poor they haven't been able to afford any specialist treatment to ease her ailments so local fundraisers have alerted hospitals around the world - including one in Spain who has now agreed to treat Shalini for free. The delighted teenager from Nowgong town in Chattarpur district of the central Indian state of Madhya Pradesh, will fly to Spain tomorrow (Sat) for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X