మానవత్వమే గెలిచింది: కేరళలో హిందువులకు ఆశ్రయం కల్పించిన మసీదు

కేరళలో వచ్చిన వరదలు ఎంతో మంది ప్రాణాలు తీసుకుపోయి ఉండొచ్చు. ఎంతో మందిని నిరాశ్రయులుగా మార్చి ఉండొచ్చు. ఎందరినో తమ వారినుంచి దూరం చేసి ఉండొచ్చు.. కానీ విపత్తు సమయంలో మనుషులు అంతా ఒక్కటే అని మాత్రం చాటాయి. భారతదేశంలో ఒక మనిషిపై ఎప్పుడూ రెండు అధికంగా ప్రభావం చూపుతాయి. ఒకటి కులం అయితే రెండోది మతం. ఈ రెండే భారత రాజకీయాలను నిర్ణయిస్తాయి.. మానవ సంబంధాలను డిసైడ్ చేస్తాయి. కానీ కేరళలో వచ్చిన వరదల్లో మాత్రం మానవత్వమే ఈ రెండిటిపై గెలిచింది. కులంతో మాకేంటి పని... మతంతో అంతకన్నా పనేముంది అని మానవత్వం ప్రశ్నించింది.

కేరళ వరదల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు సహాయం కోసం ఎదురుచూడ సాగారు. వరదల ధాటికి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురయ్యారు. తమవారు ఏ సహాయశిబిరంలో ఉన్నారో తెలుసుకోలేక పోయారు. అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా కొందరికి తెలియదు. ఇక ఇదే సమయంలో ఒక మసీదు చాలామందికి ఆశ్రయం కల్పించింది. ఇందులో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఆ సమయంలో కేవలం మానవత్వమే కనిపించింది. కులం, మతం, ప్రాంతాలు పాతాళానికి తొక్కివేయబడ్డాయి.

Humanity wins: Mosque gives shelter to Hindu families

ఉత్తర మల్లాపురం వరదలతో పూర్తిగా నాశనమైపోయింది. అక్కడి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల్లో చిక్కుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎవరైనా తమను కాపాడకపోతారా అంటూ నిస్సహాయస్థితిలో ఎదురు చూడసాగారు. అప్పుడే వారికి ఓ మసీదు ఆశ్రయం ఇచ్చింది. ఇందులో ఆశ్రయం పొందిన వారు అధికంగా హిందువులే కావడం విశేషం. బక్రీదు పండగ కోసం అందంగా ముస్తాబైన మసీదు... వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. వరదల్లో చిక్కుకున్న 17 హిందు కుటుంబాలకు ఆశ్రయం కల్పించింది మసీదు. ఇందులో మహిళలు, చిన్నారులున్నారు.

మొత్తం 26 కుటుంబాలు మసీదులో తలదాచుకున్నాయని అందులో అధికంగా హిందూ కుటుంబాలే ఉన్నాయని చలియార్ గ్రామపంచాయతీ ఛీఫ్ ఉస్మాన్ తెలిపాడు. వరదల్లో చిక్కుకున్న స్థానికులకు ఆగష్టు 8నే ఆశ్రయిం కల్పించామని అయితే ఆగష్టు 14 తర్వాత పరిస్థితి తీవ్రరూపం దాల్చిందని గుర్తు చేశారు ఉస్మాన్. బాధితులు నిద్రించేందుకు స్థలం, తినేందుకు ఆహారం, ఇచ్చినట్లు చెప్పాడు. అయితే వరద నీరు క్రమంగా తగ్గిపోతుండటంతో చాలా కుటుంబాలు తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నాయని చెప్పారు. ఇంకొదరు మసీదులోనే ఉండిపోయారని వారు బుధవారం జరిగిన బక్రీదు వేడుకల్లో పాల్గొన్నారని సంతోషం వ్యక్తం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+