ఉడుముపైన వేటగాళ్ళ అత్యాచారం.. ఆ వీడియో చూసిన అటవీ అధికారులు షాక్!!

కామా తురానాం న భయం న లజ్జ అంటారు.. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి ఎటువంటి భయమూ, తప్పు చేస్తున్నాము అన్న సిగ్గు కూడా ఉండదు అని దీని భావం. సమాజంలో కొందరు మనుషులు రోజు రోజుకి పశు ప్రవృత్తి కి అలవాటు పడుతున్నారు అని చెప్పడానికి అడవి జంతువును సైతం వదలకుండా అత్యాచారానికి పాల్పడిన వేటగాళ్ల కథ ఒక ఉదాహరణ. మహిళలు, చిన్నారులు, వృద్ధులే కాదు అడవి జంతువులకు కూడా కామాంధుల నుండి రక్షణ లేదన్నది కొన్ని ఘటనలతో అర్థమవుతుంది.

రాజస్థాన్ లో లేగదూడపై అత్యాచారం

రాజస్థాన్ లో లేగదూడపై అత్యాచారం

గతంలో లేగదూడపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఒకరు రోడ్డుపై పడుకొని ఉన్నఆడ లేగ దూడపై అత్యాచారం చేయగా, మరో నిందితుడు శబ్దం చేయకుండా దాని నోటికి చేతిని అడ్డుపెట్టి శబ్దం చెయ్యకుండా అడ్డుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్నారు. వారు ఈ చర్యను చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్ గా మారటంతో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలో వేటగాళ్ళను పట్టుకున్న అటవీ అధికారులు.. వారి దారుణాలు విని షాక్

మహారాష్ట్రలో వేటగాళ్ళను పట్టుకున్న అటవీ అధికారులు.. వారి దారుణాలు విని షాక్


ఇక అటువంటి మరో అత్యంత జుగుప్సాకరంగా అనిపించే ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీని వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర కొల్హాపూర్ సహ్యాద్రి టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొందరు వేటగాళ్లు తుపాకీలతో తిరుగుతున్నారని సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, ముగ్గురు నిందితులను వలపన్ని పట్టుకున్నారు. ఇటీవల పులుల గణన కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు, అడవులలో తుపాకీలతో సంచరిస్తున్న వేటగాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఏప్రిల్ ఒకటో తేదీన వలపన్ని మరీ వారిని పట్టుకున్న అటవీ అధికారులు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లో ఉన్న వీడియోలను చూసి షాక్ అయ్యారు.

 ఉడుమును వదలని కామాంధుడు.. అటవీ జంతువులపైనా కామ వాంఛ

ఉడుమును వదలని కామాంధుడు.. అటవీ జంతువులపైనా కామ వాంఛ


అటవీ జంతువుల పై కూడా సదరు వేటగాళ్లు కామవాంఛ తీర్చుకుంటున్నారని అందులో ఉన్న వీడియోలను బట్టి అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఒక వేటగాడు ఉడుముపై అత్యాచారం చేస్తున్న వీడియో అతని మొబైల్లో కనిపించడంతో ఒక్కసారిగా అటవీ అధికారులు షాక్ తిన్నారు. సదరు నిందితుడిని మానసిక వైద్యుల వద్దకు పంపిస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నిందితుల వద్ద బైకులు, తుపాకులు స్వాధీనం చేసుకున్న అధికారులు వారు చేసిన దారుణాలపై విచారణ జరుపుతున్నారు. వారిపై కేసులు నమోదు చేయించి వారిని అరెస్టు చేశారు.

 పశువుల్లా మారుతున్న మృగాళ్ళు.. మూగ జీవాలకు రక్షణ కరువేనా?

పశువుల్లా మారుతున్న మృగాళ్ళు.. మూగ జీవాలకు రక్షణ కరువేనా?


ఇటువంటి హేయమైన ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. మూగజీవాల పైన కూడా పశువాంఛను తీర్చుకుంటున్న మానవ మృగాల తీరు ఆందోళన కలిగిస్తుంది. కామవాంఛ తీర్చుకోవడానికి జంతువులైన, మనుషులైనా ఒకటే అన్నట్టుగా ప్రవర్తించిన వారి తీరు భయాన్ని కలిగిస్తుంది. ఏది ఏమైనా మూగజీవుల పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేసి ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+