మరదలి కోసం ఎంతపని చేశాడంటే ?, క్రికెట్ బ్యాట్ తీసుకుని భార్యను ?, బెడ్ మీద వీడియో వైరల్ !
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను పురుషుల కంటే మహిళలు ఎక్కువగా తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. భర్తను డామినేట్ చేస్తున్న భార్య ప్రతిరోజు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నది. భార్య మీద మోజు తీర్చుకున్న భర్త అతని మరదలి మీద కన్ను వేశాడు. భార్య చెల్లిని దక్కించుకోవాలని ప్లాన్ చేసిన భర్త అతని భార్యను, ఏడాది వయసున్న కూతురిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేసి ఓ సినిమా కథ అల్లాడు.
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఓ వ్యక్తి తన అందమైన భార్య, ఏడాది వయసున్న కూతురిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. భార్యను వదిలించుకుని ఆమె చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందు కోసం కట్టుకున్న భార్యను, కూతురు ఇద్దరినీ దారుణంగా హత్య చేశాడు. సినిమా స్కెచ్ వేసిన భర్త అతని భార్య, కుమార్తెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి దొంగతనం కథను అల్లాడు.

భార్య, కూతురిని హత్య చేసిన వ్యక్తి పేరు నీరజ్ కుష్వాహ. ఉత్తరప్రదేశ్ లోని లలిత్‌పూర్‌లోని సదర్ కొత్వాలి ప్రాంతంలోని చందమారి గ్రామంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నీరజ్ ఇంట్లో నుంచి భార్య, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య, కుమార్తెపై దాడి చేసి హత్య చేశారని నీరజ్ కుష్వాహా పోలీసులకు సమాచారం అందించాడు.
వేకువ జామున 1.30 గంటల సమయంలో ఆరుగురు దుండగులు మా ఇంట్లోకి చొరబడ్డారని, ఆ సమయంలో భార్య, కూతురిని హత్య చేసి నా నోట్లో సాక్స్ లు కుక్కి నగదు, బంగారు నగలు దోచుకుని పారిపోయారని నీరజ్ పోలీసులకు చెప్పాడు. తన చేతులతో తన కుమార్తెను, భార్యను హత్య చేసి దోపిడీకి పాల్పడిన నీరజ్ కుష్వాహా తరువాత ఎవరికి అనుమానం రాకుండా అతని శరీరం మీద గాయాలు చేసుకుని ఆసుపత్రిలో చేరాడు. ఆస్పత్రి బెడ్‌పై గాయపడిన అతడు పోలీసులకు వాంగ్మూలం ఇస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే నీరజ్ కుష్వాహ మాటలపై పోలీసులకు అనుమానం వచ్చింది. నీరజ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీసి విచారించగా తానే జంట హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నా భార్య అందంగా ఉంది, కేవలం రీల్స్ మాత్రమే చేస్తోందని, నా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని నీరజ్ కుష్వాహ పోలీసుల విచారణలో అంగీకరించాడు. నా భర్త అందంగా ఉండటంతో ఆమె రీల్స్ చాలా మంది చూస్తున్నారని, అయితే ఆమె రోజూ రీళ్లు చేసుకుంటూ గడిపేదని, ఇందుకోసం ఆమెను వదిలించుకుని ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని నీరజ్ పోలీసులకు చెప్పాడు.
నేను నా మరదలిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నా భార్యకు నచ్చలేదని, అందుకే ఆమెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాశానని, హత్య కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతనం కథ అల్లి ఎవరికీ అనుమానం రాకుండా చూసుకున్నానని. తన ఇంట్లో చోరీ జరిగినట్లు ప్లాన్ చేశానని, ఇంట్లోని సామాన్లన్నింటినీ పగులగొట్టి, బంగారు ఆభరణాలను ఇంట్లోని టీవీ వెనుక దాచిపెట్టానని నీరజ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు నీరజ్ పన్నిన పన్నాగాన్ని బట్టబయలు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ జంట హత్య కేసును ఛేదించిన పోలీసు బృందానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 25, 000 రూపాయల రివార్డు ప్రకటించింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications