Pujari: భార్య, కొడుకును ఇంట్లోనే నరికి చంపేసిన పూజారి, తప్పించుకోవాలని ప్రయత్నించి?
బెంగళూరు/తుమకూరు: గుడిలో అర్చకుడిగా పని చేస్తున్న పూజారికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పూజారికి భార్య, ఓ కొడుకు ఉన్నాడు. కొంతకాలం నుంచి పూజారి అతని భార్యతో గొడవపడుతున్నాడు. భర్త తీరుతో విసిగిపోతున్న భార్య కొన్ని రోజులు భర్త ఇంటిలో, కొంతకాలం సమీపంలోని గ్రామంలోని పుట్టింటిలో ఉంటున్నది. రెండు రోజుల క్రితం భార్య ఆమె భర్త ఇంటికి వెళ్లింది. రాత్రి భార్య, కొడుకుతో కలిసి భర్త భోజనం చేసి నిద్రపోయాడు. వేకువ జామున నిద్రలేచిన పూజారి అతని భార్య, కొడుకును అతి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
Manager: గూగుల్ కంపెనీ మేనేజర్ ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్, కలికాలం !

గుడిలో పూజారి
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలుకాలోని నిట్టూరు సమీపంలోని మావినహళ్ళిలో మోహన్ అలియాస్ మోహన్ స్వామి అలియాస్ స్వామి (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి మోహన్ మావినహళ్లిలోని కరియమ్మ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు.

చోరీ చేసి చిక్కిపోయాడు
ఆరు సంవత్సరాల క్రితం వరకు మావినహళ్లిలోని కరియమ్మ దేవాలయంలో పూజారిగా పని చేసిన మోహన్ స్వామి అతను పని చేస్తున్న గుడిలోనే హుండీలో డబ్బులు చోరీ చేసి చిక్కిపోయాడు. పోలీసులు మోహన్ స్వామిని అరెస్టు చేశారు. అయితే గ్రామస్తులు అందరూ కలిసి ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యనని మోహన్ స్వామి దగ్గర హామీ పత్రం రాపించుకుని కేసు లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పిలుచుకుని వచ్చేశారు.

పెళ్లి చేస్తే సరిపోతుందని ?
పోలీసులకు చిక్కిపోయిన తరువాత మోహన్ స్వామి మానసిక అస్వస్తతకు గురైనాడు. పెళ్లి చేస్తే సరిపోతుందని అనుకున్న కుటుంబ సభ్యులు మోహన్ స్వామికి కావ్యా (27) అనే మహిళతో వివాహం జరిపించారు. మోహన్ స్వామి, కావ్యా దంపతులకు జీవన్ (4) అనే కుమారుడు ఉన్నాడు.

భార్యతో గొడవలు పడుతున్న పూజారి
కొంతకాలం నుంచి పూజారి మోహన్ స్వామి అతని భార్యతో గొడవపడుతున్నాడు. భర్త మోహన్ స్వామి తీరుతో విసిగిపోతున్న కావ్యా కొన్ని రోజులు భర్త ఇంటిలో, కొంతకాలం సమీపంలోని గ్రామంలోని పుట్టింటిలో ఉంటున్నది. రెండు రోజుల క్రితం కావ్యా ఆమె భర్త మోహన్ స్వామి ఇంటికి సంతోషంగా వెళ్లింది.

దారుణంగా నరికేశాడు
రాత్రి భార్య కావ్యా, కొడుకు జీవన్ తో కలిసి భోజనం చేసిన మోహన్ స్వామి కొంతసేపు టీవీ చూసి నిద్రపోయాడు. వేకువ జామున నిద్రలేచిన పూజారి మోహన్ స్వామి అతని భార్య కావ్యా, కొడుకు జీవన్ ను అతి దారుణంగా హత్య చేశాడు. భార్య కావ్యా, కొడుకు జీవన్ ను హత్య చేసిన మోహన్ స్వామి పారిపోవడానికి ప్రయత్నించాడు. గ్రామస్తులు మోహన్ స్వామిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.