టీ ఇవ్వడం ఆలస్యం: భార్యను పొడిచి చంపేశాడు

 Husband kills wife in Odisha over delay in serving tea
భువనేశ్వర్: టీ ఇవ్వడం ఆలస్యమైనందుకు ఓ భర్త భార్యను హత్య చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ధెంకనల్ జిల్లా గుహాలివల్ గ్రామంలో మహాలియా నాయక్ అనే 56 ఏళ్ల వ్యక్తి ఉన్నాయుడు. అతను తన భార్య ఝానాను టీ తీసుకు రమ్మని అడిగాడు.

అయితే, టీ ఆలస్యంగా తెచ్చినందుకు ఆమె పైన కేకలు వేశాడు. అంతేకాదు ఆమెతో గొడవకు దిగాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం పెరిగింది.

గొడవ తీవ్రస్థాయికి పెరిగింది. దీంతో ఇంట్లో వంట చేసేందుకు భార్య అంగీకరించలేదు. మరింత కోపోద్రిక్తుడైన భర్త నాయక్ భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో శుక్రవారం ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+