వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరితో వివాహేతర సంబంధం: భార్య హత్య

|
Google Oneindia TeluguNews

wife
న్యూఢిల్లీ: తన భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను హత్య చేసిన కేసులో నిందితునికి ఢిల్లీ కోర్టు సోమవారం యావజ్జీవ కారగార శిక్షను విధించింది. 27ఏళ్ల నిందితుడు తన భార్యను అతి కిరాతకంగా, క్రూరమైన రీతిలో చంపివుంటే అతనికి ఉరి శిక్ష విధించే అవకాశం ఉండేదని, అయితే ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి చెడు జరిగే ప్రమాదం ఉందని కోర్టు వెల్లడించింది.

నిందితుడు లతీఫ్ సోదరుడు చెప్పిన వివరాలతో సెప్టెంబర్ 2012లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తన సోదరుడే అతని భార్యను హత్య చేశాడని లతీఫ్ సోదరుడు విచారాణాధికారులకు చెప్పాడు. తమ విచారణలో లతీఫ్ తన నేరాన్ని అంగీకరించాడని, తన భార్య షమను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. లతీఫ్ 2006లో షమను వివాహం చేసుకున్నాడు. వివాహామైన ఆరు నెలల తర్వాత తన భార్య చెల్లెలితో ప్రేమలో పడ్డాడు నిందితుడు లతీఫ్. కొన్ని రోజుల తర్వాత తన భార్యకు ఈ విషయం తెలియడంతో తన చెల్లెలిని కూడా వివాహం చేసుకుంటానని చెప్పడంతో.. అందుకు భార్య షమ అంగీకరించలేదు. ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి ఉండొచ్చని.. షమను ఒప్పించేందుకు లతీఫ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇందుకు ఆమె ఒప్పుకోలేదు.

తన భర్త మాటలతో షమ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎలాగైనా తన భార్య షమను వదిలించుకోవాలని భావించిన లతీఫ్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించేముందు తమను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని పోలీసులు చెప్పారు. షమ, తను రాత్రి నిద్రిస్తున్న సమయంలో కొందరు దొంగలు వచ్చి తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాము జరిపిన విచారణలో వాస్తవం బయటపడిందని పోలీసులు పేర్కొన్నారు.

English summary
A man has been sentenced to life imprisonment by a Delhi court for killing his wife, who was against his extra-marital affair with her younger sister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X