మద్యం మత్తులో భార్యను కొట్టి చంపేసిన భర్త, వీడికి ఈమె 12వ భార్య, నెలకు ఒకరు లెక్కన ?
జార్ఖండ్/రాంచీ: బయట ఫ్రెండ్స్ తో ఓ వ్యక్తి మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త మళ్లీ ఇంట్లో మద్యం సేవించడం ప్రారంభించాడు. ఇది భార్యకు కోపం తెప్పించింది. భర్త ఇంట్లో మద్యం సేవించడాన్ని అతని భార్య వ్యతిరేకించింది. అయితే మద్యం మత్తులో కోపోద్రిక్తుడైన భర్త అతని భార్యను పెద్ద కర్రతో చితకబాదేశాడు. అదే కర్రతో భార్యను కొట్టి చంపాడు.
దంపతుల పిల్లలు ఇంటికి వచ్చేసరికి దారుణ ఘటన జరిగిపోయింది. అదే సమయంలో మహిళ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పోలీసులు వెళ్లి కేసు నమోదు చేశారు. ఆ సమయంలో భర్త గురించి కలకలం రేపే ఓ స్టోరీ బయటకు వచ్చింది. తాగుబోతు భర్తకు హత్యకు గురైన మహిళ ఎన్నో భార్య అని అసలు మ్యాటర్ తెలుసుకుని అందరూ హడలిపోయారు.
జార్ఖండ్ లోని బొకరా ప్రాంతంలో రామ్ చంద్ర తూరి అలియాస్ రామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 ఏళ్ల క్రితం సావిత్రిదేవి అనే మహిళను రామ్ చంద్ర వివాహం చేసుకున్నాడు. రామ్ చంద్ర, సావిత్రీ దేవి దంపతుల పెద్ద కుమారుడు రాంచీలో ఉద్యోగం చేస్తున్నారు. సావిత్రీ దేవి మరో ముగ్గురు పిల్లలు బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లికి వెళ్లారు.

రామ్ చంద్ర రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తరువాత ఇంట్లో కూడా రామ్ చంద్ర మద్యం సేవించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని భార్య సావిత్రీని రామ్ చంద్ర వేధించడం మొదలుపెట్టాడు. అప్పటికే పీకలదాక మద్యం సేవించి ఉన్న తాగుబోతు భర్త రామ్ చంద్ర మీద సావిత్రీదేవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
ఇంట్లో మళ్లీ తాగవద్దు, ఇక చాలు అని సావిత్రీదేవి ఆమె భర్త రామ్ ను మందలించింది. సావిత్రీ మీద ఆమె భర్త రామ్ చంద్రకు కోపం ఎక్కువైంది. రగిలిపోయిన రామ్ చంద్ర అతని భార్య సావిత్రీ దేవి మీద సుత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన సావిత్రీదేవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
పెళ్లికి వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేసరికి సావిత్రీదేవి దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన రామ్ చంద్రకు గతంలో 11 మందితో పెళ్లి జరిగిందని, అందరు భార్యలు అతన్ని వదిలేసి వెళ్లిపోయారని, సావిత్రీ దేవి 12వ భార్య అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి అతని 12వ భార్యను కొట్టి చంపేయడం జార్ఖండ్ లో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications