మగ వ్యభిచారుల పేరుతో మోసం: నెలకు 4సార్లు ఛాన్స్!

హైదరాబాద్: తమ సంస్థలో మగ వ్యభిచారులుగా పని చేస్తే రూ.వేలల్లో ఆదాయం వస్తుందని హైదరాబాదుకు చెందిన ముగ్గురు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. ఈ కొత్త తరహా మోసాన్ని సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 400 మందిని మోసం చేశారని డీసీసీ(నేరాలు) పాలరాజు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆర్థిక నేరాలు, ఇంటర్నెట్ మోసాల పైన తాము ఇటీవలే ప్రారంభించిన వ్యాపార నిఘా వ్యవస్థ ద్వారా నిందితులు తుకారాం, శరణప్ప, రాజులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి వద్ద నుండి కారు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.2.45 లక్షల నగదుతో పాటు రూ.25 లక్షల విలువైన తుకారం, శరణప్ప ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి దాదుపు నాలుగు వందల మందిని మోసం చేసినట్లుగా తెలుస్తోంది.

Hyderabad police bust online Male Prostitution

తమ సంస్థ తరఫున పని చేసేందుకు మగ వ్యభిచారులు కావాలంటూ ఏడాది క్రితం తుకారాం ఓ బ్లాగులో ప్రచారం చేసుకున్నాడు. అందులో ఒక ఫోన్ నెంబరు మాత్రమే ఇచ్చారు. పేరు నమోదు చేసుకునే వారు రూ.10వేలు చెల్లిస్తే ఏడాది, రూ.6వేలు ఇస్తే ఆరు నెలల పాటు తాము వేర్వేరు క్లయింట్ల వివరాలు చెబుతామని నమ్మించారు.

నెలకు నాలుగుసార్లు అవకాశం ఇస్తామని, ఒక్క అవకాశం ద్వారా రూ.10వేల నుండి రూ.20వేల వరకు సంపాదించుకోవచ్చునని చెప్పేవారు. తమకు ఇరవై శాతం కమిషన్ ఇవ్వాలని చెప్పేవారు. నగదును బ్యాంకు ఖాతాల్లో వేయమనేవారు. ఎవరికీ చిక్కకుండా ప్రతి మూడు నెలలకు ఫోన్ నెంబరు, ఇంటర్నెట్లో ప్రకటన తీరును మార్చేవారు. చెప్పుకునేందుకు ఇష్టపడక పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించలేదు.

కాగా, హైటెక్ పద్ధతుల్లో అమాయకులను మోసం చేసేందుకు పథకం పన్నిన ముగ్గురు నిందితుల్లో తుకారం.. ఏడాది క్రితం స్టార్ హోటల్ వద్దకు కూలి పని నిమిత్తం వెళ్లినప్పుడు మగ వ్యభిచారుల విషయం తెలిసిందే. తాను కూడా ఈ విధానంలో డబ్బు సంపాదించాలనుకొని అన్ లైన్లో ప్రకటన చూసి రూ.5వేలు చెల్లించాడు. అతను కూడా గతంలో మోసపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+