మార్చే ప్రయత్నం: సయీద్‌తో భేటీపై రాందేవ్ మద్దతు
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రదారి సయీద్ హఫీజ్‌తో యోగా గురు రామ్‌దేవ్ అనుచరుడు, జర్నలిస్టు భేటీ భారతదేశంలో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీని పైన రామ్‌దేవ్ బాబా స్పందించారు. తన అనుచరుడు వేద ప్రతాప్ వైదిక్‌కు అండగా నిలిచారు.
వేద ప్రతాప్ వైదిక్ జమాతే ఉద్ దవా చీఫ్ సయీద్ హఫీజ్ మనసును మార్చేందుకు ప్రయత్నించారని తాను గట్టిగా నమ్ముతున్నానని ట్వీట్ చేశారు. వేద ప్రతాప్ వైదిక్ ఓ విలేకరి అని, ఆయన ఎవరినైనా కలవవచ్చునని బాబా రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు.

కాగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ జమాతే ఉద్ దవా చీఫ్ సయీద్ హఫీజ్‌ను ఈ నెల 2వ తేదీన లాహోర్‌లో కలిశాడు. పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్‌లో పర్యటించిన జర్నలిస్టులు, రాజకీయ నాయకుల బృందంలో వైదిక్ ఉన్నారు. వారిద్దరి మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోగ్రాఫ్ సోషల్ మీడియాలో సందడి చేసింది. దీంతో వైదిక్ విషయంపై కాంగ్రెసు బిజెపిపై విరుచుకుపడింది.
దీనిపై దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేస్తూ ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్ ఆ సమావేశం చేసిన ట్వీట్‌కు సమాధానంగా వైదిక్ తాను ఏ ప్రధానికి కూడా ప్రత్యేకమైన దౌత్యవేత్తను కానని, తనకు తానే దౌత్యవేత్తనని ట్వీట్ చేశారు. వాళ్లు పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తవచ్చునని, అయితే దానివల్ల వచ్చే ఫలితం ఏదీ ఉండదని అన్నారు. తాను బుద్ధిజీవినని, రస్సెల్, కార్ల్ మార్క్స్ వంటి బుద్ధి జీవులు ఏ దేశానికీ చెందరని వైదిక్ అన్నారు.












Click it and Unblock the Notifications