వేలెత్తి చూపకుండా, శిరస్సు వంచి నమస్కారం: మోడీ, ఎందరు ఒక్కటైనా నరేంద్రుడే!
అహ్మదాబాద్: బీజేపీని గెలిపించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Recommended Video

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. రెండు రాష్ట్రాల్లో గెలుపుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీపై గుజరాత్, హిమాచల్ ప్రజలు చూపిన ప్రేమ, విశ్వాసానికి ధన్యవాదాలు అన్నారు. తన శిరస్సు వంచి వారికి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.

వేలెత్తి చూపకుండా అభివృద్ధి
ఆయా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో వేలెత్తి చూపడానికి వీలులేకుండా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని చెప్పారు. సుపరిపాలన, అభివృద్ధికి, ప్రజలు పట్టం కట్టారన్నారు. కష్టపడి పని చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు అన్నారు.

గుజరాత్‌లో బీజేపీని ఢీకొట్టేందుకు
కాగా, గుజరాత్‌లో ముగ్గురు యువనేతలు ప్రధాని నరేంద్ర మోడీ ముందు బలాదూర్ అయ్యారు. వారు ఓటింగ్ శాతం తగ్గంచగలిగారేమో కానీ, బీజేపీ గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయారు. వారికి కాంగ్రెస్ తోడు కావడం గమనార్హం. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ గుజరాత్‌లో విజయ దుందుభి మోగిస్తోంది. దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు ముగ్గురు యువనేతలు కూడా జతకలిశారు.

మోడీ హవా చెక్కు చెదరలేదు
గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే మోడీ ప్రభావం, హవా చెక్కు చెదరలేదని అర్థమవుతోందని అంటున్నారు. సీఎంగా మోడీ ఉన్నప్పుడు గుజరాత్‌లో పారిశ్రామిక ప్రగతి కనిపించింది. అంతర్జాతీయ సంస్థలు గుజరాత్‌కు వచ్చాయి. శాంతిభద్రతలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మోడీ ఢిల్లీకి వెళ్లినా హవా తగ్గలేదు.

బీజేపీ గెలుపు సామాన్యమైనదేం కాదు
యువ నాయకుల మద్దతు, కాంగ్రెస్ జోరు, ఇరవై రెండేళ్లుగా పాలిస్తున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతను కాదని బీజేపీ గెలవడం సాధారణ విషయం కాదు. 2014లో లోకసభ ఎన్నికల్లో బీజేపీ 26 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు సీట్లు, ఓట్లు తగ్గినప్పటికీ మోడీ కారణంగా బీజేపీ గెలుపొందింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications