వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంజ్ కారు కొనేంత స్తోమత నాకు లేదు: నితిన్ గడ్కరీ

|
Google Oneindia TeluguNews

తనకు బెంజ్ కారు కొనేంత స్తోమత లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. పుణెలోని చకన్ తయారీ యూనిట్ లో ఇండియాలోనే అసెంబుల్ చేసిన EQS 580 4MATIC EVని గడ్కరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బెంజ్ ఇండియాకు ఆయన ఒక సూచన చేశారు. భారత్ లో ఉత్పత్తులను పెంచాలన్నారు. విలాసవంతమైన కార్ల తయారీగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ ధర తగ్గి అందుబాటులోకి రావాలంటే ఉత్పత్తులు పెరగాలని, ధర తగ్గుతుందని, కొనుగోలు చేయడానికి ప్రజలు ముందుకు వస్తారన్నారు.

నేను మధ్యతరగతి వాణ్ని

నేను మధ్యతరగతి వాణ్ని


''తామంతా మధ్యతరగతికి చెందినవాళ్లమని, తాను కూడా ఈ కారును కొనలేనన్నారు''. గడ్కరీ ఆవిష్కరించిన ఈవీ దర రూ.1.55 కోట్లు. దేశంలో విద్యుత్తు వాహనాలకు పెద్ద మార్కెట్ ఉందని, ఇప్పటివరకు 15.7 లక్షల ఈవీలు రిజిస్టరైనట్లు తెలిపారు. వీటి విక్రయాలు 335 శాతం పెరిగాయని, దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని, దీనివల్ల బెంజ్ కార్లకు మంచి మార్కెట్ ఉంటుందని మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.

సమర్థవంతంగా పనచిస్తున్న గడ్కరీ

సమర్థవంతంగా పనచిస్తున్న గడ్కరీ


రహదారులశాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నట్లు పార్టీలో మంచి అభిప్రాయం నెలకొంది. ప్రధానమంత్రి మోడీ తర్వాత ఆ పదవికి రేస్ లో ఉన్న వ్యక్తి కూడా గడ్కరీయే. అయితే 70 సంవత్సరాలు దాటినవారంతా పార్టీలోను, ప్రభుత్వంలోను పదవుల నుంచి తప్పుకోవాలనే నిబంధన ఉంది. అయితే ఆ నిబంధన ప్రస్తుతం మోడీకి వర్తిస్తుందా? లేదా? అనేది పార్టీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం మోడీ వయసు 73 సంవత్సరాలు.

 బెంజ్ కారుతోనే సైరస్ మిస్త్రీ ప్రమాదం

బెంజ్ కారుతోనే సైరస్ మిస్త్రీ ప్రమాదం


టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఇటీవలే రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ సమయంలో ఆయన వాడుతున్న కారు బెంజ్ కంపెనీదే. ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాదానికి దారితీసిన కారణాలేంటి? కారు ఎటువంటి భద్రతను అందించలేకపోయింది? తదితర విషయాలను తెలుసుకునేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి నివేదిక రూపొందించారు.

English summary
Union Surface Transport Minister Nitin Gadkari has commented that he cannot afford to buy a Benz car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X