రెండున్నరేళ్లు: మెలిక పెట్టిన షిండే
New Maharashtra CM: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఏక్‌నాథ్ షిండే తన మనసు మార్చుకోకపోవడం దీనికి ప్రధాన కారణం. స్వయంగా భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నా ఆయన మెత్తబడట్లేదు.
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. షిండేకు మరోసారి అవకాశం ఇవ్వాలని లేదా కనీసం 50:50 పవర్ షేర్ ఫార్ములాను అయినా అంగీకరించాలని ప్రతిపాదిస్తోంది. ఇప్పటివరకు షిండే సేన పెట్టిన ఏ ఒక్క డిమాండ్‌కు కూడా బీజేపీ తల ఊపలేదు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వైపే మొగ్గు చూపుతోందా పార్టీ.
ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే తన స్వగ్రామంలో ఉంటోన్నారు. మూడు రోజుల కిందటే అక్కడికి వెళ్లారు. సతారా జిల్లాలోని దరేటంబ్ ఆయన స్వగ్రామం. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన నేపథ్యంలో ఇక్కడే విశ్రాంతి తీసుకుంటోన్నారు. కొద్దిసేపటి కిందటే విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రెండున్నర సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పని చేశానని, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని షిండే గుర్తు చేశారు. ఈరోజుక్కూడా ప్రజలు తనను వచ్చి కలుస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అనే హోదాలో కాకుండా ఓ సామాన్యుడిలా పని చేశానని, అందుకే మహారాష్ట్ర ఓటర్లు మహాయుటి కూటమికి ఇంత భారీ మెజారిటీతో పట్టం కట్టారని అన్నారు.
మహాయుటి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని షిండే తేల్చి చెప్పారు. దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌తో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, కొత్త ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి?, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పరిపాలన ఎలా సాగించాలి?, హామీలను ఎలా అమలు పర్చాలనే విషయం మీద తమకు మంచి అవగాహన ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
బీజేపీ ముఖ్యమంత్రి సారథ్యంలోనే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఇదివరకే తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు భరోసా ఇచ్చానని చెప్పారు. ఈ విషయంలో బీజేపీకి బేషరతు మద్దతు ఇస్తానని అన్నారు. ఈ విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం షిండే ప్రత్యేక హెలికాప్టర్‌లో ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సతారా జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications