తిరిగి రాడని తెలుసు, కానీ..: రోదిస్తూ ఐఎఎస్ రవి తల్లి గౌరమ్మ
బెంగళూరు: తన కుమారుడికి న్యాయం జరగాలంటే సీబీఐతో కేసు దర్యాప్తు చేయించాలని ఐఏఎస్ అధికారి డి.కే. రవి తల్లి గౌరమ్మ పట్టబడుతున్నారు. తనకు కర్ణాటక ప్రభుత్వం మీద, ఇక్కడి అధికారుల మీద నమ్మకం లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ దెబ్బతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది.
"రవికి నేను జన్మనిచ్చాను. తన చేతులతో అతనిని పెంచాను. రవి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అనేది మాకు తెలుసు. ఐఏఎస్ అధికారి కాక ముందు నుండి ఈ సమాజం మారాలి, మార్చడానికి నాకు అవకాశం రావాలని లని నాతో ఎన్నోసార్లు చెప్పాడు. ఆ దేవుడని ప్రార్థించాడు. అలాంటి వ్యక్తి ఈ సమాజాన్ని మార్చడానికి ఐఏఎస్ అధికారి అయ్యాడు. అవకాశం వచ్చిన తరువాత రవి ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేపోతున్నాం" ఆమె వన్ ఇండియా ప్రతినిధితో అన్నారు.

"రవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇక అతను తిరిగిరాడని మాకు తెలుసు. ఆ దేవుడి దగ్గర ఉన్న నా కుమారుడు రవి ఆత్మశాంతించాలంటే అతనిని కష్టపెట్టిన వారికి శిక్షపడాలి. అందుకే మేము కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని పట్టబడుతున్నాం. ఈ ప్రభుత్వం, ఇక్కడి అధికారులు, ఈ సమాజం రవిని వేదించి చంపేశారు. ఇక్కడి అధికారుల వలన న్యాయం జరగుతుందని మాకు నమ్మకం లేదు" అని ఆమె అన్నారు.
"రవి ఆత్మశాంతించాలంటే తప్పు చేసిన వారికి శిక్షపడాలి. అంత వరకు పోరాటం చేస్తాం అని గౌరమ్మ అన్నారు. ఈ సమాజాన్ని మర్చాలని కళలు కన్న రవి కళ చివరికి కళగానే మిగిలిపోయిందని గౌరమ్మ విలపిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు మాయమాటలు చెబుతున్నారే కాని కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించమంటే మాత్రం అది కుదరదు అని అంటున్నారు" అని అన్నారు.
"అంటే రవి మరణానికి వేరే కారణాలు ఉన్నాయి. సీబీఐతో రవి కేసు దర్యాప్తు చేయిస్తే వారి అసలు రంగు బయటపడుతుందని భయపడుతున్నారు. దయ చేసి నాబిడ్డకు న్యాయం చెయ్యండి. అతని మరణానికి కారణం అయిన వారిని శిక్షించండి. మాకు సహాయం చెయ్యండి" అంటూ రవి తల్లి గౌరమ్మ విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications