జయలలిత కుమార్తె అంటున్న అమృత, అవునా, బెంగళూరు బ్యాక్ గ్రౌండ్ గురించి, దినకరన్ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను నేను అంటూ బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల కోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను నేను అంటూ బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల కోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో ఆమె నిజంగా జయలలిత కుమార్తెనా ? లేకపోతే అమృత ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటూ ఇప్పుడు జోరుగా చర్చ మొదలైయ్యింది.

అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ను తమిళనాడులోని తిరుచ్చిలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన అమృత జయలలిత కుమార్తెనా, కాదా ? అని మీడియా ప్రశ్నిస్తే టీటీవీ దినకరన్ తనదైన శైలిలో స్పంధించారు.

I dont know about Bengaluru Amruthas background says TTV Dinakaran

జయలలిత కుమార్తె నేనే అంటూ అమృత కోర్టును ఆశ్రయించిన విషయం తాను మీడియాలో చూశానని టీటీవీ దినకరన్ చెప్పారు. అయితే బెంగళూరుకు చెందిన అమృత గురించి, ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తనకు ఏమాత్రం తెలీదని, వివరాలు సేకరించాల్సిన అంత అవసరం తనకు ఇంతవరకూ రాలేదని టీటీవీ దినకరన్ చెప్పారు.

మీ గ్రూప్ లోని ముగ్గురు ఎంపీలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయారు కదా అంటూ మీడియా ప్రశ్నించింది. ఇంకా చాల మంది ఆ వర్గంలోకి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోందని మీడియా ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని, కొందరు తమిళనాడు ప్రభుత్వానికి డబ్బుల కోసం అమ్ముడుపోతున్నారని టీటీవీ దినకరన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+