‘విసిగిపోయా.. బతకాలని లేదు..’, సూసైడ్‌కు ముందు స్నేహితురాలికి మెసేజ్!
భోపాల్: 'జీవితంలో విసిగిపోయా.. బతకాలనిపించడం లేదు..' ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తన ఆత్మహత్యకు ముందు స్నేహితురాలికి పంపించిన మెసేజ్ ఇది. చదువులో ఎప్పుడూ ముందుండే ఆ విద్యార్థిని రైలుకింద పడి ప్రాణాలు తీసుకుంది. అయితే ఆమె బలవన్మరణానికి సహ విద్యార్థి బ్లాక్ మెయిలింగే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మహిమా పరివార్ ఒకవైపు తాను చదువుకుంటూనే మరోవైపు చిన్నారులకు ట్యూషన్ చెబుతుండేది. ఆమె తన సహవిద్యార్థి బ్లాక్‌మెయిలింగ్ భరించలేక ఇటీవల రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మహిమా పరివార్ తన స్నేహితురాలికి ఒక మెసేజ్ పెట్టింది. అందులో..'జీవితంలో విసిగిపోయా..' అని పేర్కొంది. ఆమె ఆ స్థితికి రావడానికి శ్రేయాంస్ అనే సహ విద్యార్థి కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల శ్రేయాంస్ తమ కుమార్తె ఫొటోలు తీసి బెదిరిస్తున్నాడని, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications