వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict:పరిపూర్ణమైన తీర్పు, ‘ప్రవక్త’కు సంబంధంలేదు: ఏఎస్ఐ మాజీ డైరెక్టర్ ముహమ్మద్

|
Google Oneindia TeluguNews

కోజికోడ్: చారిత్రక అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పు పరిపూర్ణమైనదని ఆర్కియాలజీసర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) మాజీ రీజినల్(నార్త్) డైరెక్టర్ కేకే ముహమ్మద్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.

Ayodhya verdict: ఊహాజనితం కాదు! అయోధ్య తీర్పులో ఆర్కియాలజీ నివేదిక ఎలా కీలకమైందంటే..?

పరిపూర్ణమైన తీర్పు..

పరిపూర్ణమైన తీర్పు..

ఏఎస్ఐ సమర్పించిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. తాను ఇలాంటి తీర్పు ఊహించలేదని, ఇది చాలా పరిపూర్ణమైన తీర్పు అని ముహమ్మద్ వ్యాఖ్యానించారు. ఇది చాలా ప్రమాణికమైన తీర్పు అని అభిప్రాయపడ్డారు.

ముస్లింలకు మక్కా, మదీనా.. హిందువులకు అయోధ్య

అయోధ్యలో బాబ్రీ మసీదు కంటే ముందు రామ మందిరమే ఉందని ముహమ్మద్ వ్యాఖ్యానించారు. తామంతా కోరుకున్న విధంగానే సుప్రీంకోర్టు తీర్పు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ముస్లింలకు మక్కా, మదీనా ఎలానో.. హిందువులకు అయోధ్య అలాగేనని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రవక్తకు సంబంధం లేదు...

ఈ ప్రాంతంతో ప్రాఫెట్‌(ప్రవక్త)కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ముహమ్మద్. ఏఎస్ఐ అందించిన ఆర్కియాలాజికల్, చారిత్రక సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే అక్కడ మందిరం ఉందని.. మనం కొత్త మందిరరాన్ని నిర్మించాలని కోర్టు పరిపూర్ణమైన తీర్పు ఇచ్చిందని చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు ఇలా..

సుప్రీంకోర్టు తీర్పు ఇలా..

కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.

మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

English summary
K K Muhammad had once said death is preferable while on duty. He made this comment when he was told he was going to be suspended for making public the fact that he had discovered temple remnants inside the Babri Mosque.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X