వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra: అసెంబ్లీ రద్దు అవుతుందని శివసేన, రద్దు చెయ్యమని మిత్రపక్షం, ఏది నిజం, దేవుడా !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకు మలుపు తిరుగుతున్నాయి. శివసేన సీనియర్ నాయకుడు, రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూప్ రాజకీయాలతో మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితికి వస్తోంది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది, మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్ చేశారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాము, అయితే ఫలితం మాత్రం కనిపించడం లేదని, అందుకే అసెంబ్లీని రద్దు చెయ్యాలని మా నాయకుడు ఉద్దవ్ ఠాక్రే ఆలోచిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు.

అయితే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్ వైరల్ కావడంతో తెరమీదకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనకాని, అలాంటి పరిస్థితి లేదని, మా సంకీర్ణ ప్రభుత్వాన్ని మేమే కాపాడుకుంటామని, ఇప్పుడే సీఎంతో ఫోన్ లో మాట్లాడామని మీడియా ముందు చెప్పారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన నాయకులు ఓ రకంగా, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మరో రకంగా మాట్లాడటంతో ఆ పార్టీ నాయకులు, ప్రజలు అయోమయానికి గురౌతున్నారు.

Politics: సీఎం, దేవుడు మావాడే. అయితే పూజారి మాత్రం ?, విసిగిపోయి ఇలా చేశాము, బాంబు పేల్చిన రెబల్స్!Politics: సీఎం, దేవుడు మావాడే. అయితే పూజారి మాత్రం ?, విసిగిపోయి ఇలా చేశాము, బాంబు పేల్చిన రెబల్స్!

 ఏక్ నాథ్ దెబ్బతో సీఎం మైండ్ బ్లాక్

ఏక్ నాథ్ దెబ్బతో సీఎం మైండ్ బ్లాక్

శివసేన రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఆ పార్టీ నాయకులు, ఆ రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ నాయకుల మైండ్ బ్లాక్ అయ్యింది. మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకు మలుపు తిరుగుతున్నాయి. శివసేన సీనియర్ నాయకుడు, రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూప్ రాజకీయాలతో మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితికి వస్తోంది.

 సంజయ్ రౌత్ ట్వీట్ తో కలకలం

సంజయ్ రౌత్ ట్వీట్ తో కలకలం

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది, మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్ చేశారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాము, అయితే ఫలితం మాత్రం కనిపించడం లేదని, అందుకే అసెంబ్లీని రద్దు చెయ్యాలని మా నాయకుడు ఉద్దవ్ ఠాక్రే ఆలోచిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

 కాంగ్రెస్ కౌంటర్ ప్రెస్ మీట్

కాంగ్రెస్ కౌంటర్ ప్రెస్ మీట్

శివసేన పార్టీ అగ్రనాయకుడు సంజయ్ రౌత్ ట్వీట్ వైరల్ కావడంతో ఆ పార్టీ నాయకులు షాక్ అయ్యారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే తరువాత పార్టీకి సంబంధించి ఎలాంటి ముఖ్య విషయాలు అయినా సంజయ్ రౌత్ మీడియా ముందు మాట్లాడుతారు. అలాంటి సంజయ్ రౌత్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని ట్వీట్ చెయ్యడంతో బిత్తరపోయిన కాంగ్రెస్ నాయకులు కౌంటర్ గా ముంబాయిలో ప్రెస్ మీట్ పెట్టారు.

 అసెంబ్లీని రద్దు చెయ్యం

అసెంబ్లీని రద్దు చెయ్యం

మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనకాని, అలాంటి పరిస్థితి లేదని, మా సంకీర్ణ ప్రభుత్వాన్ని మేమే కాపాడుకుంటామని, ఇప్పుడే సీఎం ఉద్దవ్ ఠాక్రేతో మా పార్టీ నాయకుడు కమల్ నాథ్ ఫోన్ లో మాట్లాడామని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటేల్ బుధవారం ముంబాయిలో మీడియాకు చెప్పారు.

 అందరూ కలిసే ఉన్నారు

అందరూ కలిసే ఉన్నారు

కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది శాసన సభ్యులు ఒక్కటిగానే ఉన్నారని, మా పార్టీ ఎమ్మెల్యేలలో చీలిక రాలేదని నానా పటేల్ అన్నారు. బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి 41 మంది ఎమ్మెల్యేలు హాజరైనారని, ముగ్గురు ఎమ్మెల్యేలు వివిద ప్రాంతాల్లో ఉన్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటేల్ అన్నారు.

 నాయకులకే క్లారిటీ లేదా ?

నాయకులకే క్లారిటీ లేదా ?

బుధవారం రాత్రికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ముంబాయి చేరుకుంటారని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటేల్ మీడియాకు చెప్పారు. అయితే మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన నాయకులు ఓ రకంగా, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మరో రకంగా మాట్లాడటంతో ఆ పార్టీ నాయకులు, ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా, లేదా అని నాయకులకే క్లారిటీ లేదని కార్యకర్తలు అంటున్నారు.

English summary
I have talked to CM Uddhav Thackeray and he said that as of now there's no proposal to dissolve the Maharashtra Assembly, Kamal Nath
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X