ఢిల్లీలో బాంబు పేల్చిన పన్నీర్ సెల్వం: అమ్మ తరువాత పార్టీ నాదే, ఆ చాన్స్ లేదు !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే శశికళ వర్గానికి సినిమా చూపించారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి లేకున్నా ఆ పార్టీని నడిపించే అర్హత ట్రెజరర్ (కోశాధికారి)గా తనకే ఉందని పన్నీర్ సెల్వం బాంబుపేల్చారు.

అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం మరో వర్గం తయారు చేసుకున్నారు. ఆయన వర్గంలో 13 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు (ఒక రాజ్యసభ సభ్యుడు) ఉన్నారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి ఇరు వర్గాలు ఎన్నికల కమిషన్ ముందు పోటీపడుతున్నాయి.

పన్నీర్ సెల్వం వాదన

పన్నీర్ సెల్వం వాదన

రెండాకుల చిహ్నం తమకే కేటాయించాలని పన్నీర్ సెల్వం వర్గం ఎన్నికల కమిషన్ కు మనవి చేసింది. ఇప్పటికే దాదాపు 12,500 పేజీల అఫిడవిట్లను ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. పార్టీలోని కీలకపదవుల్లో ఉన్న నాయకులు అంతా తమ వర్గంలోనే ఉన్నారని పన్నీర్ సెల్వం ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించారు.

పోటా పోటీగా శశికళ వర్గం

పోటా పోటీగా శశికళ వర్గం

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ లను తాము ఎన్నుకున్నామని చిన్నమ్మ వర్గంలోని నాయకులు ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు. మరన్ని అఫిడవిట్లు సమర్పించడానికి సమయం కావాలని శశికళ వర్గం ఎన్నికల కమిషన్ ముందు మనవి చేశారు.

అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఇవే

అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఇవే

అన్నాడీఎంకే పార్టీ నియమాల ప్రకారం ప్రధాన కార్యదర్శి పార్టీని నడిపించాలి. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి లేని సమయంలో ఆ పార్టీ కోశాధికారి పార్టీ బాధ్యతలు చూసుకోవాలని, తానే పార్టీ కోశాధికారి అంటూ శుక్రవారం పన్నీర్ సెల్వం ఎన్నికల కమిషన్ ముందు అఫిడవిట్ సమర్పించారు.

దినకరన్ మీద చర్యలు తీసుకోండి

దినకరన్ మీద చర్యలు తీసుకోండి

రెండాకుల చిహ్నం కోసం మీ కార్యాలయంలోని అధికారులకు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు మనవి చేశామని పన్నీర్ సెల్వం వర్గీయులు మీడియాకు చెప్పారు.

శశికళ ఫ్యామిలీ ఔట్, తరువాతే !

శశికళ ఫ్యామిలీ ఔట్, తరువాతే !

అన్నాడీఎంకేలోని రెండా వర్గాలు విలీనం చర్చలు మొదలుపెట్టాలంటే పార్టీ నుంచి శశికళ కుటుంబ సభ్యులను పూర్తిగా బయటకు పంపించిన తరువాతే అది జరుగుతుందని పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు కేపీ. మునిసామి స్పష్టం చేశారు.

నాయకులు ఉంటే కాదు, ప్రజలు !

నాయకులు ఉంటే కాదు, ప్రజలు !

ఎడప్పాడి పళనిసామి వర్గంలో కేవలం నాయకులు మాత్రమే ఉన్నారని, అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అందరూ మా వైపే ఉన్నారని కేపీ. మునిసామి గుర్తు చేశారు. అయితే పళనిసామి వర్గంలోని నాయకులు త్వరలో మా వర్గంలో చేరిపోతారని కేపీ. మునిసామి జోస్యం చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో

రాష్ట్రపతి ఎన్నికల్లో

రాష్ట్రపతి ఎన్నికల్లో మా వర్గం ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయంలో ఓ క్లారిటీ ఉందని, త్వరలో ఆ నిర్ణయం ప్రకటిస్తామని పన్నీర్ సెల్వం అంటున్నారు. అయితే పన్నీర్ సెల్వం మోడీ వైపు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రధాని నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ?

ప్రధాని నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ?

ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లిన పన్నీర్ సెల్వం జయలలిత తరువాత అన్నాడీఎంకే పార్టీని నడిపించే అధికారం తనకే ఉందని మొదటిసారి నోరు విప్పడంతో ఎడప్పాడి పళనిసామి వర్గీయులు హడలిపోయారు. రెండాకుల చిహ్నం పన్నీర్ సెల్వం వర్గం చేతికి వచ్చిందంటే శశికళ వర్గానికి కచ్చితంగా సినిమా చూపిస్తారని అంటున్నారు. ప్రధాని మోడీ తన వెంట ఉన్నారనే ధైర్యంతోనే పన్నీర్ సెల్వం ఈ కొత్త నినాదం తెరమీదకు తీసుకు వచ్చారని తెలిసింది.


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే శశికళ వర్గానికి సినిమా చూపించారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి లేకున్నా ఆ పార్టీని నడిపించే అర్హత ట్రెజరర్ (కోశాధికారి)గా తనకే ఉందని పన్నీర్ సెల్వం బాంబుపేల్చారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో రూ. 89 కోట్లు

ఎమ్మెల్యే ఎన్నికల్లో రూ. 89 కోట్లు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా టీటీవీ దినకరన్ వర్గీయులు రూ. 89 కోట్లు విచ్చలవిడిగా ఓటర్లకు పంచిపెట్టారని, మరే ఎన్నికల్లోనూ పోటీ చెయ్యకుండా అతని మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు మనవి చేశామని పన్నీర్ సెల్వం వర్గీయులు మీడియాకు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the absence of a general secretary, according to party rules, the treasurer is liable to lead the party. Until fair elections are conducted and a general secretary is elected, I have the right to lead the party, Panneerselvam said.
Please Wait while comments are loading...