టిప్పు సుల్తాన్ చరిత్ర: ఎంత క్రూరుడు అంటే, మైసూరు రాజులను వదల్లేదు, డీసీఎం !
బెంగళూరు: టిప్పు సుల్తాన్ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద తాను ఒత్తిడి చేస్తానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠ్య పుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చరిత్ర ఉంటే ఆయనగారు చేసిన అరాచకాలు, అక్రమాలు, ఘనకార్యాల గురించి విద్యార్థులకు తెలుస్తోందని, లేదంటే పిల్లలకు మనం వివరించాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఆలోచన !
పాఠ్యా పుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్ చరిత్రను తొలగించాలనే విషయంపై ఆలోచిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం (బీజేపీ) చెప్పింది. టిప్పు సుల్తాన్ చరిత్ర గురించి విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన అంత గొప్ప పనులు ఏమీ చెయ్యలేదని బీజేపీ నాయకులు అంటున్నారు.

టిప్పు జయంతికి మంగళం !
సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించింది. ప్రభుత్వ నిధులతో కర్ణాటక మొత్తం టిప్పు సుల్తాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే టిప్పు సుల్తాన్ జయంతిని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది.

టిప్పు అరాచకాలు !
టిప్పు సుల్తాన్ ఎన్నో అరాచకాలు చేశాడని, అతను చాలా క్రూరుడు అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ అన్నారు. టిప్పు సుల్తాన్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని, మత మార్పిడి పేరుతో ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడని, అతని గురించి విద్యార్థులు తెలుసుకోవాలని, లేదంటే మనం అతని అరాచకాల గురించి వారికి వివరించాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి డాక్టర అశ్వథ్ నారాయణ అన్నారు.

మైసూరు రాజుల మీద దాడులు
పేదలను ఆదుకుని, శాంతియుతమైన పాలన అందించిన మైసూరు మహారాజుల మీద టిప్పు సుల్తాన్ దాడులు చేశారని, చివరికి మైసూరు యదువీరులు ( రాజులు)ను వదల్లేదని ఇటీవల మైసూరు-కొడుగు ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహా ఆరోపించిన విషయం తెలిసిందే.

డీకే వర్గీయుల దాడులు !
మాజీ మంత్రి డీకే. శివకుమార్ వర్గీయులు తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని, ఎలాంటి పరిస్థితుల్లో తాము అధికార దుర్వినియోగం చెయ్యమాని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ అన్నారు. మా పార్టీ అధికారంలో ఉన్నా బీజేపీ కార్యకర్తలు మాత్రం భయంతోనే బతుకుతున్నారని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ విచారం వ్యక్తం చేశారు. అయితే మా కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చినా చూస్తూ మౌనంగా ఉండమని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను హెచ్చరించారు.
-
మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! -
విజయ్ చుట్టూ వల- నయానో, భయానో -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications