ఈ మూడున్నరేళ్ల బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

డాక్టర్ దగ్గరికి వచ్చిన ప్రతిసారీ మూడున్నరేళ్ల కుమారుడు శ్రీ బ్లాంకెట్‌లో ముసుగదన్ని ఆయన నుంచి దాక్కోవాలని చూస్తున్నాడు. డ్రాయింగ్ బుక్‌ను పక్కనే ఉంచుకుంటున్నాడు. దయ్యాల్లాగా కనిపించేట్లు కొమ్ములతో డాక్టర్ల, నర్సుల స్కెచ్‌లు వేశాడు. గత రెండు వారాలుగా తీసుకుంటున్న సిరంజీలకు భయకంపితుడవుతున్నాడు. శ్రీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు నిర్దారించడంతో ఈ నెలలో నా హృదయం ముక్కలవుతోంది.

ఆ మాట విన్నప్పటి నుంచి రెండు పదాలు నా చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి. నా కుమారుడు కొండ అంచున నిలబడి ఉన్నట్లు ప్రతి రోజూ నాకు అనిపిస్తోంది. చికిత్స ఖర్చులు భరించలేని నా స్థితి అతన్ని కిందికి తోసేస్తుందేమో, అతన్ని జీవితంలో పూర్తిగా కోల్పోతానేమోనని భయమేస్తోంది. శ్రీ చిన్నపిల్లవాడు కావడంతో ఆరు నెలల పాటు కెమెథెరపీ ఇస్తే నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఖర్చు రూ. 12 లక్షలు అవుతుంది. ఆ చికిత్స వ్యయం తలుచుకుంటే రాత్రుళ్లు నాకు నిద్ర పట్టడం లేదు. క్యాన్సర్ మా ఇంటి తలుపు తట్టే వరకు రెండు వారాల క్రితం దాకా మా జీవితాలు సజావుగా సాగిపోతూ వచ్చాయి. ఆ తర్వాతే మా జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. క్యాన్సర్ నుంచి బయటపడడానికి నా పుత్రుడి చికిత్స కోసం సహాయం అవసరం.

I’m Struggling To Pay For My 3.5-Year-Old Son’s Cancer Treatment

నా పేరు సందేశ్ కదం. నేనో సేల్స్‌మన్‌ని. నాకు నెలకు రూ. 8వేలు మాత్రమే వస్తుంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇల్లు మార్చాల్సి వచ్చింది. దాంో అదనంగా రూ 4వేల ఖర్చు పెరిగింది. చికిత్స కోసం ఇప్పటి వరకు నేత 90 వేల రూపాయలు ఖర్చు చేశాను. నా కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి సర్వం ఒడ్డాను. నా వద్ద ఏమీ మిగలలేదు. తొలి కెమెథెరపీ సెషన్‌ ముగిసిన తర్వాత వెంటనే వెళ్లాల్సి ఉంది. ఇంటి అద్దె చెల్లించిన తర్వాత పరీక్షలకు, మందులకే నా వేతనం హరించుకుపోతోంది.

అది ఏ విధంగా ప్రారంభమైందో నాకిప్పటికీ నాకు గుర్తుంది. మా ఇంటి వద్ద ఉన్న పార్కులో నేను శ్రీ తిరుగాడుతున్నాం. అది మా సాయంత్రం ఆచారంగా మారింది. కొన్ని అడుగులు వేసిన తర్వాత శ్రీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.. ప్రతి అడుగు అతని శక్తిని లాగేస్తున్నట్లు కనిపించాడు. రోజు గడుస్తున్న కొద్దీ అతని చేతులు, పెదవులు తెల్లబారాయి. అతని శరీరంలో రక్తం కరిగిపోతున్నట్లు అనిపించింది. మేం ఆస్పత్రికి పరిగెత్తాం. అతని ఊపిరితిత్తుల్లో సమస్య ఉండవచ్చునని వైద్యులు చెప్పారు. బోన్ మ్యారో పరీక్షలు నిర్వహించిన తర్వాత అంతకన్నా తీవ్రమైన అక్యూట్ లింఫోబ్లాస్టిక ల్యుకేమియాతో నా కుమారుడు బాధపడుతున్నట్లు నివేదికల్లో తేలింది.

I’m Struggling To Pay For My 3.5-Year-Old Son’s Cancer Treatment

వైద్యులను వెర్రిమొర్రి ప్రశ్నలతో విసుగెత్తించిన తర్వాత అక్యూట్ లింఫోసైటిక్ ల్యుకేమియా (ఎఎల్ఎల్) అనేది ఓ రకమైన బ్లడ్, బోన్ మ్యారో క్యాన్సర్ అని వివరించారు. అక్యూట్ అనే పదం వ్యాధి వేగంగా పెరుగుతుందనే విషయాన్ని, వృద్ధి చెందిన రక్త కణాల కన్నా అప్పుడప్పుడే ఆవిర్బవిస్తున్న కణాలను తినేస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది. నేరుగా ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వనంత వేగంగా ఆ వ్యాధి పెరుగుతుంది. శ్రీకి ప్రతి రోజూ రూ. 1.000 ఖరీదు చేసే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. నా యాజమాన్యం నుంచి నేను రూ. 50 వేల అప్పు తీసుకున్నాను. ఇప్పటి వరకు చికిత్స అందించడానికి నేను ఆదా చేసుకున్న సొమ్ము అంతా అయిపోయింది.

కుటుంబంలో సంపాదించే వ్యక్తి సందేశ్ ఒక్కడే. ఆయన తన కుమారుడి చికిత్స ఖర్చులను భరించడానికి పోరాడుతున్నాడు. మీరు ఇక్కడ సాయం చేయవచ్చు.

ఇంటి చుట్టూ పరుగెత్తడానికి నా కుమారుడు ఇష్టపడుతాడు. నాతో పార్కులో ఆట ఆడడానికి ఇష్టపడుతాడు. ఈ వ్యాధి అతన్ని ఆస్పత్రికి పడకకే పరిమితం చేసింది. ఆస్పత్రిలో టెలివిజన్ లేదు కాబట్టి అతను తనకు ఇష్టమైన కార్టూన్ శివ అండ్ ఒగ్గి, కాక్రోచ్ చూసే అవకాశాన్ని కోల్పోతున్నాడు. కెమోథెరపీ అతని నాలుకలోని రుచిగ్రంతులను నాశనం చేసి ఉంటాయి, ఏది తిన్నాలన్నా ఒకే రుచి ఉన్నట్లుంది. అందువల్ల అతను చాలా తక్కువగా తింటున్నాడు.

I’m Struggling To Pay For My 3.5-Year-Old Son’s Cancer Treatment

నేను అతన్ని చాలా ప్రశ్నలు అడుగుతుంటాను. "సిరంజీ చాలా నొప్పిగా ఉందా?", "శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందా?", "ఏమైనా తింటావా?"లాంటి ప్రశ్నలు వేస్తుంటాను. చాలా సార్లు అతను మౌనంగా ఉండిపోతాడు. ఈ ప్రక్రియకు గురిచేసినందుకు అతను మాపై కోపంగా ఉన్నట్లు కనిపిస్తాడు.అతను తన బెస్ట్ ఫ్రెండ్ - ప్లాస్టిక్ ఎల్లో డక్‌‌కు మాత్రమే పరిమితమవుతాడు. దాన్ని ఆస్పత్రికి తెచ్చుకున్నాడు. రాత్రుళ్లు అతను దాంతో మాట్లాడుతుంటాడు. కొన్ని సార్లు దానికి ఫిర్యాదులు చేస్తుంటాడు. తాను ఆస్పత్రిని అసహ్యించుకుంటున్నట్లు చెబుతుంటాడు. ఇంటికి వెళ్లాలని, నాతో మళ్లీ సాయంత్రాలు వాహ్యాళికి వెళ్లాలని అంటుంటాడు.

అతన్ని ఈ తీవ్రమైన సిరంజీల బాధ నుంచి, కెమోథెరపీ సెషన్స్ నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంటున్నాను. కానీ నా చేతులు కట్టి పడేసి ఉన్నాయి. డబ్బు మాత్రమే అతన్ని ఆస్పత్రి నుంచి బయటపడేస్తుంది. నీకు ఏమీ కాకుండా కాపు కాస్తానంటూ నేను అతనికి హామీ ఇస్తూ వస్తున్నాను. నీ కోసమే నేను ఉన్నానని చెబుతున్నాను. కానీ అవి అతనికి ఊరటనివ్వడం లేదు. ఈ విధమైన అతని కష్టాలను చూడలేకపోతున్నాను. దయచేసి అతనికి సహాయం చేయండి

కెట్టోపై అతని నిధి సమీకరణకు విరాళం ఇచ్చి సందేశ్‌కు సహాయం చేయగలరు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sandesh is the sole breadwinner of his family and his struggling to pay for his son’s cancer treatment. You can help him out here.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి