పెద్ద నగదు నోట్ల రద్దు తో పెరిగిన ఆపిల్ ఐ ఫోన్ అమ్మకాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావంతో వ్యాపారాలు కుదేలు అవుతున్న వార్తలు చూశాం, విన్నాం, కాని, ఆపిల్ ఐ ఫోన్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. మూడు రోజుల్లోనే లక్ష ఫోన్లు అమ్మకాలు జరిగాయి. పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన అర్థరాత్రి కూడ ఐఫోన్ కొనుగోళ్ళు జరిగాయి.

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల విక్రయాలు భారీగా పడిపోయాయని చెబుతోంటే, ఆపిల్ ఐ ఫోన్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఐ పోన్ 7 ఫ్లస్ ఫోన్ విక్రయాలు అధికంగా ఉన్నాయని మొబైల్ కంపెనీల నిపుణులు చెబుతున్నారు.

i phone sales increase after 500,1000 rupees currency ban in india

ఆపిల్ కంపెనీకి చెందిన ఎస్ 7 ప్లస్ తో పాటు ఇతర మోడల్ ఫోన్లు విపరీతంగా విక్రయాలు జరిగాయి. ఈ ఫోన్లు ధరలు తక్కువ ఉండవు. ఇతర కంపెనీల ఫోన్లతో పోలిస్తే ఈ కంపెనీ ఫోన్లు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో రద్దు చేసిన నగదుతో ఎక్కువ మంది ఆపిల్ ఐ ఫోన్లను కొనుగోలు చేశారు.

నవంబర్ 8వ, తేదిన రాత్రి పూట ఫోన్ల దుకాణాల్లో వినియోగదారుల సందడి విపరీతంగా ఉంది.తెల్లవారు జాము వరకు కూడ మొబైల్ దుకాణలను తెరిచి ఉంచినట్టు ఓ మొబైల్ షాపు యజమాని చెప్పాడు.రద్దు చేసిన నగదు ను వదిలించుకొనేందుకు గాను ఖరీదైన ఆపిల్ మొబైల్ కొనుగోలు కోసం వినియోగించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
currency ban effect not on apple i phone. 1 lakh i phone sales in three days only. currency ban effect on every business, but i phone sales increase. on nov 8th mobile stores working till early morning . consumers buy this phones with the banned currency
Please Wait while comments are loading...