వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

300 సీట్లు వస్తాయంటే కొంతమంది నవ్వారు : ప్రధాని నరేంద్రమోడీ

|
Google Oneindia TeluguNews

ఆరవ దశ ఎన్నికల ప్రచారంలోనే తాను బీజేపీ 300 పైగా సీట్లను సాధిస్తామని చెప్పానన్నారు ప్రధాని నరేంద్రమోడీ, అయితే అప్పుడు చాలమంది ఎద్దెవా చేశారని అన్నారు. కాని ఫలితాలు తాను చెప్పినట్టుగానే వచ్చాయని ఆయన పేర్కోన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాకుండా ప్రభుత్వ అనుకూల ఓటుతో ఇన్ని సీట్లు సాధించామని ఆయన స్పష్టం చేశారు. స్వరాష్ట్ర్రానికి చేరుకున్న మోడీ ప్రధానమంత్రిగా ఈనెల 30వ తేదిన ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీ గుజరాత్‌లోని తల్లి హీరాబేన్ ఆశిస్సులు తీసుకునేందుకు స్వరాష్ట్ర్రానికి వెళ్లారు. ఈనేపథ్యంలోనే ఆయన తన మద్దతుదారులను ఉద్దెశించి మాట్లాడారు.

గుజరాత్ ప్రజల ఆశీస్సులు నాకు ప్రత్యేకం

గుజరాత్ ప్రజల ఆశీస్సులు నాకు ప్రత్యేకం

ఈనేపథ్యంలోనే శనివారం జరగిన సూరత్ అగ్నిప్రమాదంపై మరోసారీ తీవ్ర దిగ్పాంత్రిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంభాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గుజరాత్ ప్రభుత్వం విపత్తులను ఎదుర్కోనేందుకు మరింత శక్తివంతమైన ఏర్పాట్లను చేస్తోందని తెలిపారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర్ర ప్రజల దీవేనలు అందుకునేందుకు గుజరాత్‌కు వచ్చానని అన్నారు. కాగా గుజరాత్ ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు.

ప్రజలే ముందుండి పోరాడారు..

ప్రజలే ముందుండి పోరాడారు..

రానున్న అయిదు సంవత్సరాల్లో భారత దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడతానని అన్నారు. దీంతో పాటు సామాన్యుల ఆశలకు అనుగూణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది సాధించే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. ప్రజలు మరోసారి అతిపెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించారని వారు మరోసారి పూర్తి మెజారిటి ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ప్రధాని పేర్కోన్నారు.
ప్రస్థుతం ఎన్నికల్లో పోటి చేస్తున్నది బీజేపీగాని ,ఎన్డీఏ కాని కాదని భారత దేశ ప్రజలే ముందుండి పోరాడుతున్నారని ఎన్నికల ప్రచారం ప్రారంభంలో బీజేపీతో పాటు ఎన్డీఏ వర్గాలకు చెప్పానని తెలిపారు.

అహ్మాదాబాద్‌లో మోదీకి ఘన స్వాగతం

అహ్మాదాబాద్‌లో మోదీకి ఘన స్వాగతం

తిరుగులేని ఆధిక్యం సాధించిన మోడీ ఆయన తల్లి హీరాబేన్ ఆశీర్వాదాలు తీసుకునేందుకు గుజరాత్‌కు చేరుకున్నారు. దీంతో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే అహ్మదాబాద్‌కు చేరుకున్న నేపథ్యంలోనే ఆయనకు విమానశ్రాయంలోనే పార్టీ చీఫ్ అమిత్ షా, గుజరాత్ రాష్ట్ర్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ఘన స్వాగతం పలికారు.అనంతరం యమున నది ఒడ్డున నిర్వహించిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

English summary
Prime Minister Narendra Modi addressed a huge rally at his hometown Ahmedabad after his landslide victory in the national elections. His party BJP swept the polls, decimating the Congress, and no other party could manage a single seat in Gujarat.This is the first rally the Prime Minister addressed after the thumping win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X