వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధికకు మరో చిక్కు: రాడాన్ సంస్థ భారీగా పన్ను ఎగవేత, తేల్చేసిన ఐటీ అధికారులు

ప్రముఖ సినీ నటి రాధిక ఐటీ దాడులతో చిక్కుల్లో పడ్డారు. ఆమెకు చెందిన రాడాన్ సంస్థ రూ.4.97 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. రాధిక భర్త,

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ సినీ నటి రాధిక ఐటీ దాడులతో చిక్కుల్లో పడ్డారు. ఆమెకు చెందిన రాడాన్ సంస్థ రూ.4.97 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. రాధిక భర్త, సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ నివాసంలో ఇటీవల ఐటీ అధికారులు రెండుసార్లు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

డబ్బులు ముట్టాయంటూ ప్రచారం..

డబ్బులు ముట్టాయంటూ ప్రచారం..

ఆర్కేనగర్‌ ఎన్నికల సందర్భంగా అధికార అన్నాడీఎంకే నాయకుల నుంచి భారీగా నగదును అందుకుని ఆ పార్టీ అభ్యర్థి దినకరనకు చివరిక్షణంలో శరత్‌కుమార్‌ మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

ఐటీ సోదాలు

ఐటీ సోదాలు

ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు శరత్‌కుమార్‌ నివాసంతో పాటు, ఆయన సతీమణి రాధిక నడుపుతున్న రాడాన్ సంస్థ కార్యాలయంలో కూడా సోదాలు జరిపారు.
రెండుసార్లు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం వారిద్దరూ ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

పన్ను ఎగవేత

పన్ను ఎగవేత

ఈ విచారణలో రాడాన్ సంస్థ రూ.4.97 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు తేలిందని ఐటీ వర్గాలు తెలిపాయి. కాగా, ఆ మొత్తం చెల్లించేందుకు రాధిక, శరత్ కుమార్‌ అంగీరించినట్లు సమాచారం.

గీతాలక్ష్మి ఇంట్లోనూ సోదాలు

గీతాలక్ష్మి ఇంట్లోనూ సోదాలు

మరోవైపు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ మద్దతుదారుగా భావిస్తున్న ఎంజీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ గీతాలక్ష్మిని కూడా విచారించారు. ఏప్రిల్ 7న మంత్రి విజయభాస్కర్‌తో పాటు శరత్ కుమార్‌, గీతాలక్ష్మి, మాజీ ఎంపీ చీట్లపాక్కం రాజేంద్రన్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదా చేశారు.

English summary
I-T dept quizzes educationist, actors Sarath Kumar, Radhika
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X