నా భర్త మీద చర్యలు తీసుకోవాలి: కేజ్రీవాల్‌కు లిపిక
న్యూఢిల్లీ: తన భర్త మీద కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చెయ్యాలని ఢిల్లీ శాసన సభ్యుడు సోమనాథ్ భారతి భార్య లిపిక మిత్ర మనవి చేస్తున్నారు. ఢిల్లీలో ఆమె ఢిల్లీ మహిళ కమిషన్ చేర్మెన్ బర్ఖా శుక్లాతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ తన బాధను అర్థం చేసుకుని పూర్తి వివరాలు సేకరించి తనకు న్యాయం చేస్తారని నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆప్ శాసన సభ్యుడు సోమనాథ్ భారతి మీద ఆయన భార్య లిపిక మిత్ర గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా ఢిల్లీ మహిళ కమిషన్ ను లిపిక మిత్ర ఆశ్రయించారు. ఢిల్లీ మహిళ కమిషన్ సోమనాథ్ భారతీకి సమన్లు జారీ చేసింది. ఈ సందర్బంలో సోమనాథ్ భారతి స్పందించారు. తనను రాజకీయంగా దెబ్బతియ్యడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అందులో భాగంగా తన మీద లిపిక మిత్ర దగ్గర కేసులు పెట్టించారని మండిపడ్డారు. చాలా కాలం నుండి తాను తన భార్య ఇంటికి వెల్లడం లేదని చెప్పారు. అలాంటి సమయంలో తన మీద లిపిక మిత్ర గృహహింస కేసు ఎలా పెడుతుందని ప్రశ్నించారు.
అయితే నిత్యం రాత్రి పూట మాత్రమే తన ఇంటికి తన భర్త సోమనాథ్ భారతి వస్తాడని లిపిక మిత్ర అంటున్నది. ఈ విషయం తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని అడిగితే చెబుతారని అన్నారు. తనను సోమ్ నాథ్ భారతి హింసించినట్లు వీడియో క్లిప్పింగ్ లు ఉన్నాయని లిపిక మిత్ర అంటున్నారు.












Click it and Unblock the Notifications