వైరల్ వీడియో: ఎడారిలో నేను, ఒంటె మాత్రమే ఉన్నాం.. కాపాడండి ప్లీజ్..

ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన భారత యువకుడు అక్కడ మోసపోయి ఎడారిలో చిక్కుకుపోయాడు. తనను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో సౌదీ అరేబియా దౌత్య అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఉత్తర్ ప్రదేశ్, ప్రయాగ్ రాజ్ జిల్లాలోని హందియా ప్రాంతానికి చెందిన యువకుడు ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లగా.. అక్కడ మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రస్తుతం సౌదీలోని భారత దౌత్య కార్యాలయం అధికారులు యువకుడ్ని ట్రేస్ చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలో మోసపోయిన ఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సౌదీ అరేబియా కఫాలా వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటన బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. తనకు చెప్పిన పని వేరని.. కానీ ఇక్కడ ఓ పెద్ద ఎడారిలో ఒంటెతో పాటు నన్ను వదిలేశారని ఆ యువకుడు వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. కపిల్ అనే వ్యక్తి.. తన పాస్ పోర్టును లాక్కుని చంపేస్తానని బెదిరించినట్లు తెలిపాడు. తనను కాపాడాలంటూ ఈ మేరకు ప్రధాని మోదీని వేడుకున్నాడు.. ప్లీజ్ హెల్ప్ మీ.. ఐ విల్ డై అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

I Will Die Here UP Youth s Heart-Wrenching Video Exposes Saudi Job Scam

" మా ఊరు అల్లహాబాద్ లో ఉంది. నేను సౌదీ అరేబియా వచ్చాను. నా పాస్ పోర్టు కపిల్ వద్ద ఉంది. నేను ఇంటికి వెళ్తానని చెబితే.. అతను నన్ను చంపేస్తానని బెదిరించాడు. నేను నా తల్లి వద్దకు వెళ్లాలి. ప్లీజ్ హెల్ప్ మీ.. ఐ విల్ డై" అంటూ భోజ్ పురీ భాషలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు యువకుడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయితే ఈ వార్త ప్రధాని మోదీ వరకు వెళ్తుందని ఆ యువకుడు వీడియోలో పేర్కొన్నాడు.

అయితే ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది సేపటికే రియాద్ లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ప్రస్తుతం అతడ్ని గుర్తించే పనిలో ఉంది. వీడియోలో అతను తన ప్రాంతం వివరాలను పేర్కొనలేదని దౌత్య కార్యాలయం పేర్కొంది. ఇదే విషయంపై యువకుడ్ని తక్షణమే రక్షించాలని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ను పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేశారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+