బీజేపీ మాకంటే మంచి పాలన అందిస్తుందనే, ట్యూబ్‌లెస్: అఖిలేష్ షాకింగ్
తమ కంటే వచ్చే (బీజేపీ) ప్రభుత్వం మరింత మంచి పాలన అందిస్తుందని భావిస్తున్నానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం అన్నారు. బీజేపీ చేతిలో ఘోర పరాజయం ఓటమి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
లక్నో: తమ కంటే వచ్చే (బీజేపీ) ప్రభుత్వం మరింత మంచి పాలన అందిస్తుందని భావిస్తున్నానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బీజేపీ చేతిలో ఘోర పరాజయం ఓటమి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం మాకంటే బాగా పని చేస్తుందని..
ఎన్నికల్లో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వం తమ కంటే బాగా పని చేస్తుందని తాను భావిస్తున్నానని అఖిలేష్ అన్నారు. మరి మాకంటే మంచి పాలన అందిస్తుందో లేదో చూడాలన్నారు.

కాంగ్రెస్‌తో బంధం కొనసాగుతుంది
ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని అఖిలేష్ చెప్పారు. తొలి కేబినెట్ సమావేశంలోనే రైతు రుణమాఫీ చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో తమ బంధం కొనసాగుతుందని తెలిపారు. మా హయాంలో యూపీలో మంచి పాలననే అందించామని చెప్పారు.
మాయావతి ఆరోపణలపై ఆలోచన చేయాలి
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపణలపై కేంద్రం, ఎన్నికల సంఘం ఆలోచన చేయాలని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీఎస్పీ ఆరోపణలపై తాను ఇప్పుడే మాట్లాడనని, విచారణ జరిపించాక మాట్లాడుతానన్నారు.
మాది ట్యూబ్ లెస్ టైర్
తమది ట్యూబ్ లెస్ సైకిల్ అని, కాబట్టి తమ సైకిల్‌కు గాలి పోవడం అన్నది జరగనే జరగదని చెప్పారు. తమ ప్రభుత్వం మంచి పాలనే అందించిందని, ప్రజలు ఇంతకంటే మంచి పాలన కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును స్వీకరించడమే గౌరవప్రదం అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications